Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cyberabad Police: ఘరానా మోసంతో కోట్లు కొల్లగొట్టారు

–సినీ నిర్మాత బషీద్‌, బ్యాంకు మేనే జర్‌ కలిసి అక్రమ లావాదేవీలు
–ఆదిత్య బిర్లా ఖాతాల నుంచి సొ మ్ములు కొల్లగొట్టిన వైనం
–బ్యాంకు మేనేజర్‌ సహా ముగ్గురి అరెస్టు

Cyberabad Police: ప్రజా దీవెన, హైదరాబాద్‌: ఒక సినీ నిర్మాతతో కలిసి బ్యాంకు మేనేజర్‌, మరో ఉద్యోగి (Bank manager and another employee)కుమ్మక్కై మోసపూరిత లావాదేవీలతో రూ.40 కోట్లు కొల్లగొట్టారు. సైబరాబాద్‌ పోలీసులు (Cyberabad Police)మంగళవారం వారిని అరెస్టు చేశా రు. ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు శంషా బాద్‌ జోన్‌లో బ్రాంచి మేనేజర్‌గా పనిచేస్తున్న రామస్వామి, డెలివరీ మేనేజర్‌ రాజేశ్‌ అక్రమ లావాదే వీలు జరిపి బ్యాంకుకు రూ.40 కోట్లు నష్టం చేశారని బ్యాంకు జోనల్‌హెడ్‌ మణికందన్‌ రామనా థన్‌ (Bank Zonal Head Manikandan Ramana Than)ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

రామస్వామి, రాజేశ్‌ను (Ramaswamy, Rajesh) అదుపులోకి తీసుకొ ని విచారించారు. వ్యాపారి, సినీ నిర్మాత అయిన షేక్‌ బషీద్‌ ప్రోద్బ లంతో ఈ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. మొదటి నుంచి ఆర్థిక నేరాలకు పాల్పడే బషీద్‌కు బ్యాంకు మేనేజర్‌తో పరిచయమైంది. సుల భంగా రూ.కోట్లలో డబ్బు సంపా దించాలనే ఉద్దేశంతో ఉన్న బషీద్‌.. బ్యాంకు మేనేజర్‌కు సలహా ఇచ్చా డు. ఆదిత్య బిర్లా హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థకు (Aditya Birla Housing Finance Co) చెందిన ఖాతాలన్నీ ఇండస్‌ ఇండ్‌ బ్యాంకులోనే ఉండడంతో అనధికారికంగా ఆ ఖాతాల్లోని డబ్బులు వేరే ఖాతాల్లోకి మళ్లించి రూ.కోట్లు కొల్లగొట్టొచ్చని చెప్పాడు. రూ.వేల కోట్ల టర్నోవర్‌ కలిగిన సంస్థ కావడంతో కొట్టేసిన సొమ్మును గుర్తించడానికి చాలా సమయం పడుతుందని తెలిపాడు. మోసపూరిత లావాదేవీలకు ప్రతిఫలంగా ఫార్చ్యూనర్‌ కార్లు బహుమతిగా ఇస్తానని చెప్పాడు. ఇందుకు అంగీకరించిన మేనేజర్‌ రామస్వామి, డెలివరీ మేనేజర్‌ రాజేశ్‌తో కలిసి మోసపూరిత లావాదేవీలు (transaction) జరిపి రూ.40 కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు తేల్చారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 2006లో ఎస్‌బీకే ప్రొడక్షన్‌ హౌస్‌ను (SBK Production House)ప్రారంభించిన బషీద్‌.. పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆర్థిక మోసాల్లో ఆరితేరిన బషీద్‌పై పలుస్టేషన్లలో 10కి పైగా కేసులున్నట్లు గుర్తించారు.