Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Damodar Rajanarsimha:నూలిపురుగుల నిర్మూలనకు కట్టుబడిన ప్రభుత్వం

–రాష్ట్రంలో సంగారెడ్డి, మహబూ బాబాద్ జిల్లాలలో 14 ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్నాం
–జాతీయ ఫైలేరియా, నులిపురుగు ల నిర్మూలన దినోత్సవం సందర్భం గా కేంద్ర ఆయుష్, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి ప్రతాప్ రావు జాదవ్ తో వర్చువల్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ

Damodar Rajanarsimha: ప్రజా దీవెన, హైదరాబాద్: జాతీయ ఫైలేరియా మరియు నులిపురుగుల నివారణ కార్యక్రమం లో భాగంగా కేంద్ర ఆయుష్ మరియు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి (Minister of Medical, Health and Family Welfare)(ఇండిపెండెంట్) ప్రతాప్ రావు జాదవ్ నిర్వహించిన వర్చువల్ మీటింగ్ లో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Rajanarsimha) హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర కేంద్ర సచివాలయం లోని తన కార్యాలయం నుండి పాల్గొన్నారు. ఈ వర్చువల్ కార్యక్రమంలో బీహార్, జార్ఖండ్, కర్ణాటక, ఒడిషా, తెలంగాణ మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల వైద్య , ఆరోగ్యశాఖ రాష్ట్రాల మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ వర్చువల్ కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Rajanarsimha) మాట్లా డుతూతెలంగాణ రాష్ట్రంలో ఫైలేరియా మరియు నులిపురుగుల నివారణ కు చేపడుతున్న చర్యలను కేంద్రమంత్రికి వివరించారు.

రాష్ట్రంలో సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాలో 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిల లోని ప్రజలకు బోధకాల వ్యాధి మరియు నులిపురుగుల వ్యాధి నివారణకు (prevention of worm disease) D.E.C & ఆల్బెండజోల్ మరియు హైపర్ మెట్టిన్ మాత్రలను నేటి నుంచి (10.ఆగస్టు.2024) నుండి పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందుకుగాను, తెలంగాణ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో సంగారెడ్డి మహబూబాద్ జిల్లాల పరిధిలోని 14 ఆరోగ్య కేంద్రాల లో మాత్రల పంపిణీకి 2,600 మంది సిబ్బందికి శిక్షణను ఇచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశామన్నారు. అలాగే, 2522 మంది డ్రగ్ అడ్మినిస్ట్రేటర్లు క్షేత్రస్థాయిలో సేవలందిస్తారని మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. ఈ సందర్భంగా ఫైలేరియా మరియు నులిపురుగుల నివారణ కు చేపడుతున్న చర్యల పై రూపొందించిన అవగాహన కరపత్రాలను, బ్రోచర్లను (Pamphlets, brochures) ఆవిష్కరించారు.

జాతీయ ఫైలేరియా మరియు నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంలో భాగంగా కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్ గారితో పాటు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గార్లు ఐపర్ మెక్టిన్ (Ivermectin), DEC మాత్రులను వేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ బోదకాలు , నులి పురుగుల నివారణకు నిర్మూలనకు ప్రతి ఒక్కరూ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల సిబ్బంది అందించే మాత్రలను వేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని పైలేరియా నిర్మూలన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల ప్రభుత్వ కార్యదర్శి డా. క్రిస్టినా పాల్గొన్నారు.