Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Dana Nagender VS Padi Kaushik Reddy: దానం వర్సెస్ పాడి ఎమ్మెల్యేల మధ్య వార్

Dana Nagender VS Padi Kaushik Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్‌: అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం మితిమీరిపోతోంది. నువ్వా నేనా అంటూ దేనికైనా సై అనే రీతిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరికి మించి ఒకరు డైలాగులు విసురు తుండడంతో రాజకీయ రంగు పులుముకుంటుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ (Dana Nagender), బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ల (Padi Kaushik Reddy) మధ్య వ్యక్తిగత దూషణలపర్వం కొనసాగుతోంది. అసెంబ్లీలోనే అడ్డగోలుగా ఒకరిపై మరొకరు భారీ డైలాగులతో దాడి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలో అధి కాస్త బజారునబడి నడిరోడ్డు పైకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నా యి. తాజాగా నడిబొడ్డున తిరుగుతున్నా ఎక్కడి కి రమ్మం టావో చెప్పు అంటూ ఎమ్మె ల్యే దానం నాగేంద‌ర్ కు సవాలు విసి రారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. గ‌తంలో లక్ష్మారెడ్డి, సుధీర్‌ రెడ్డి (Lakshmar Reddy, Sudhir Reddy)ఉప్పల్‌లో ఉరికించింది మరిచిపోయావా అని గుర్తు చేశారు. ఇదే విధంగా మాట‌లు జారితే మ‌రోసారి ఉరికించి కొట్ట‌డం ఖాయ‌మ‌న్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద శనివారం నాడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ శాసనసభలో దానం నాగేందర్‌కు ముఖ్యమంత్రి మైక్‌ ఇప్పించి తమ ను తిట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో దానం సంస్కా రం లేకుండా మాట్లాడారని మండిప డ్డారు. నిరుద్యోగుల కోసం తాము కొట్లాడుతుంటే, ఆయ‌న‌ నీచమైన మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. దానం మాటలన్నీ నిరు ద్యోగులను ఉద్దేశించినవేనని చెప్పా రు. ఆ ఎమ్మెల్యే బెదిరింపులకు భయపడేవాళ్లు ఎవరూ లేరని స్పష్టం చేశారు. దానంకి ఎమ్మెల్యే పదవి కేసీఆర్‌ (kcr)పెట్టిన భిక్ష అని లిపారు. సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి ఆయ‌న‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ (demand) చేశారు.

రెండు ల‌క్ష‌ల ఉద్యోగాలు (jobs) ఇచ్చింది మేమే… దేశంలో 2లక్షల 2 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది కేసీఆర్‌ మాత్రమేనని అన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేయలేదని ఆయన తెలిపారు. తన సవాలుకు కాంగ్రెస్‌, బీజేపీ (bjp) నోరు మెదపడం లేదని విమర్శించా రు. కేసీఆర్‌ ఇచ్చిన 30వేల ఉద్యో గాలు కూడా సీఎం రేవంత్‌ రెడ్డి (revanth reddy) ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. సిగ్గులేకుండా రేవం త్‌ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.అసెంబ్లీలో (assembly)కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాబ్‌ క్యాలెండర్‌పైనా మాట్లాడుతూ, జాబ్‌ క్యాలెండర్‌లో ఉద్యోగ ఖాళీల వివరాలు లేవని ఆయన అన్నారు. జాబ్‌ క్యాలెండర్‌పై ఎవరి సంతకం లేదని పేర్కొన్నారు. తేదీలు, ఉద్యో గ ఖాళీలతో జాబ్‌ క్యాలెండర్ ఇస్తా మని చెప్పి ఇప్పుడు సీఎం, డిప్యూ టీ సీఎం సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.