–కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
— నేను పక్కా లోకల్ అధికారులు వస్తుంటారు పోతుంటారు
— హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై చిందులేసిన నాగేందర్
Danam Nagender: ప్రజా దీవెన, హైదరాబాద్: ఖైరతా బాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై (Danam Nagender) జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో (Jubilee Hills Police Station)కేసు నమోదయింది. ఈ నెల 10వ తేదీ న జూబ్లీహిల్స్ డివిజన్ నందగిరి హిల్స్ గురు బ్రహ్మనగర్‌లోని జీహె చ్ఎంసీ (GHMC)స్థలంలో నిర్మించిన ప్రహరీని ఆయన సమక్షంలో ఆక్రమణదా రులతో కూల్చి వేసినట్టు ఎన్‌ఫో ర్స్‌మెంట్ అధికారి పాపయ్య ఇచ్చి న ఫిర్యాదు మేరకు ఈ కేసు నమో దు చేశారు. ఎమ్మెల్యే దానంతో పా టు కొందరు ఆక్రమణదారుల నింది తులుగా పోలీసులు పేర్కొన్నారు.
ప్రహరీ కూల్చివేతతో ₹పది లక్షల నష్టం నగర పరిధి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్-69 (JUBILEE HILLS ROAD NO) నందగిరి హిల్స్‌లోని గురుబ్రహ్మనగర్ కాలనీ లో 800 గజాల వరకూ ప్రభుత్వ స్థలం ఉంది. ఈ ఓపెన్ ల్యాండ్‌ను పరిరక్షించే క్రమంలో ప్రహరీ నిర్మిం చాలని జీహెచ్ ఎంసీ అధికారులు నిర్ణయించారు. ఖైరతాబాద్ ఎమ్మె ల్యే దానం నాగేందర్ సమక్షంలోనే ఆయన అనుచరులు గోపాల్ నా యక్, రాంచందర్ తదితరులు గోడ ను కూల్చేయించారు. ఈ విషయం పై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి వి.పాప య్య ఫిర్యాదు చేశారు. ప్రహరీ కూ ల్చివేతతో జీహెచ్ఎంసీ రూ. పది లక్షల మేరకు నష్టం వాటిల్లిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
నేను పక్కాలోకల్ : దానంనా గేందర్ (Danam Nagender) …అధికారులు వస్తుం టారు పోతుంటారు..నేను ఇక్కడే శాశ్వతంగా ఉంటానని ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రంగా స్పందిం చారు.ఆ ఘటనపై సీఎంకు (cm) ఫిర్యా దు చేస్తానని తెలిపారు. హిమాయ త్ నగర్ డివిజన్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమా నికి వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేం దర్ మీడియాతో మాట్లాడారు. అధి కారులు వస్తూఉంటారు, పోతూ ఉంటారు, కానీ తాను ఇక్కడ లోక ల్ అని, ఐపీఎస్ ఆఫీసర్ రంగనా థ్‌కు కొత్తగా వచ్చిన పదవీ ఇష్టం లేనట్లుంది, అందుకే తనపై కేసు పెట్టారని అన్నారు. జరిగిన విష యాన్ని ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ కాస్మో పాలిటన్ సిటీ (Cosmopolitan City) కాబట్టి, అన్నివర్గాల ప్రజలకు సౌకర్యాలు కల్పించడం, సమస్యలు పరిష్కరించం ప్రజాప్ర తినిధిగా తన బాధ్యత అని ఎమ్మె ల్యే దానం అన్నారు. నందగిరి హి ల్స్ హుడా లే ఔట్ ఘటనపై అధికా రులకు ప్రివిలేజీషన్ నోటీసులు ఇస్తానని, ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు.
ప్రజాప్రతినిధిగా ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంది… ప్రజాప్రతినిధి గా తన నియోజకవర్గంలో ఎక్కడికై నా వెళ్లే హక్కు ఉందని, నన్ను అ డ్డుకొని అధికారం ఎవరికీ లేదని దానం నాగేందర్ (Danam Nagender) అన్నారు. గతంలో ప్రజా వ్యతిరేక విధానాలను ఎదు రించినందుకు తనపై కేసులు పెట్టా రని, ఇప్పుడు తనకు కేసులు కొత్తే మికాదని చెప్పారు.