Phone tapping: హైకోర్టు సంచలన నిర్ణయం సుమోటోగా ఫోన్ ట్యాపింగ్
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఊహించని కీలక పరిణామం జరిగింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సాక్షాత్తూ హైకోర్టు జడ్జి జస్టిస్ కాజా శరత్ ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని కేసులోని ఓ నిందితుడు (ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు) తన వాంగ్మూ లంలో పేర్కొన్నట్లు వార్తలు గుప్పు మన్న నేపథ్యంలో హైకోర్టు సంచ లన నిర్ణయం వెలువరించింది.
విచారణకు స్వీకరించిన తెలం గాణ ఉన్నత న్యాయస్థానం
హైకోర్టు జడ్జి ఫోన్ ట్యాప్ చేశా రన్న వాంగ్మూలం ఆధారంగా
పత్రికల్లో కథనాల ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
సుమోటో కు ఆదివారమే సీజే ఆదేశం,నేడు విచారణ చేపట్టనున్న సీజే ధర్మాసనం
ప్రజా దీవెన, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్(Phone tapping)వ్యవహారంలో ఊహించని కీలక పరిణామం జరిగింది. గత బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సాక్షాత్తూ హైకోర్టు జడ్జి జస్టిస్ కాజా శరత్ ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని కేసులోని ఓ నిందితుడు (ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు) తన వాంగ్మూ లంలో పేర్కొన్నట్లు వార్తలు గుప్పు మన్న నేపథ్యంలో హైకోర్టు సంచ లన నిర్ణయం వెలువరించింది. పలు పత్రికల్లో ఈ అంశంపై వచ్చిన కథ నాలను సుమోటోగా(Sumoto)విచారణకు స్వీకరిస్తూ ఆసక్తి రేకెత్తించింది. ఆ క్రమంలోనే సుమోటో పిటిషన్‌పై మంగళవారం చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్ కుమార్‌ల ధర్మా సనం విచారణ చేపట్టనుంది. ఇందు లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), తెలంగాణ డీజీపీ, హోంశా ఖ ముఖ్య కార్యదర్శి, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ప్రతివాదులుగా పేర్కొ న్నారు.
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడి యాలలో కటింగ్‌లను ధర్మాసనం ఎదుట రిజిస్ట్రీ ఉంచింది. హైకోర్టు ఎదుట విచారణ జాబితాలో ఉన్న పిటిషన్‌లో వివరాలు ఇలా ఉన్నా యి. ‘‘చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ఈ నెల 2న ఇచ్చిన ఆదేశాల ప్రకారం పలు పత్రికల్లో మే 29న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్ ఫోన్ ట్యాపింగ్ అయిందని వచ్చిన వార్తా కథనాలను సుమోటోగా ఈ కేసు లిస్ట్ చేశారు. హైకోర్టు జడ్జి మొబైల్ ట్యాపింగ్ గురైనట్లు పత్రిక ల కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన నేపద్యంలో గత బీఆర్‌ఎస్ హయాంలో అక్రమంగా ఫోన్ ట్యా పింగ్ చేశారని, అందులో భాగం గానే జస్టిస్ శరత్(Justice Sharat)కూడా టార్గెట్‌గా మారారని ఆ కథనాల్లో ఉంది. బీఆ ర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్‌ను(KTR) విమర్శించిన వారి ఫోన్‌లు ట్యాపిం గ్ చేసినట్లు భుజంగరావు స్టేట్‌మెం ట్‌ను ఉటంకిస్తూ రాశారు.
టీఎస్‌పీ ఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై విమర్శలు చేసిన వారి ఫోన్లు ట్యా పింగ్ చేశారు. అప్పటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ ఆదేశాల మేరకు హైకోర్టు జడ్జిల ఫోన్‌లు సైతం ట్యాపింగ్ చేసినట్లు వార్తా కథనాల్లో ఉంది. సదరు ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రభాకర్‌రావే పర్యవేక్షించినట్లు భుజంగరావు స్టేట్‌మెంట్‌లో వెల్ల డైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇత ర నిందితులు మేకల తిరుపతన్న, డి.ప్రణీత్‌రావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, భుజంగరావు తదితరులు ప్రభాకర్‌రావు నుంచి ఆదేశాలు రాగానే ప్రత్యేక దర్యాప్తు బృందంగా ఏర్పడి, ఉగ్రవాదుల జాడను పసిగట్టే పరికరాలతో అప్ప టి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫోన్‌లు ట్యాప్ చేశా మని, ప్రణీత్‌రావు ఇచ్చే వివరాల ఆధారంగా జడ్జిలు, ప్రతిపక్ష నేతలు, అదేవిదంగా బీఆర్‌ఎస్ సొంత నాయకులపై నిఘా పెట్టా మని భుజంగరావు స్టేట్‌మెంట్‌ను ఉటంకిస్తూ పత్రికల్లో పేర్కొన్నారు.
విద్యార్థి నాయకులు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యులు ఫోన్‌లు సైతం ట్యాప్ చేసినట్లు అందులో పేర్కొన్నారు. దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల(GHMC Elections)సందర్భంగా కూడా ట్యాపింగ్ చేసినట్లు పత్రికల కథనాల్లో ప్రస్తావించారు. మూడో సారి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో సివిల్ వివాదాలు పరిష్క రించేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని భుజంగరావు ప్రకటనలో ఉంది. పెద్ద పెద్ద కంపెనీలు, పలుకుబడి కలిగిన వ్యక్తులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించాలని ప్రణాళిక వేసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ లీడర్ల ఆదేశాలతో పెద్ద మొత్తంలో డబ్బు ను టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో రెండు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించా మని, సంధ్య శ్రీధర్‌రావు చేత రూ.13 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లు క్రిమినల్ కేసుల భయం చూపి కొనిపించామని స్టేట్‌మెం ట్‌లో ఉంది. కేసీఆర్ పోటీ చేసిన కామారెడ్డిపై ప్రత్యేక దృష్టి పెట్టా మని, బీజేపీ అభ్యర్థి వెంకట్ర మణారెడ్డి, రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిపై నిఘా పెట్టామని భుజంగరావు అంగీకార ప్రకటన చేసినట్లు పత్రికల కథనాల్లో పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్, జీపీఎస్ లొకేషన్ ఆధారంగా గాలి అనిల్ కుమార్, కె.వినయ్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిల(Ponguleti Srinivas Reddy)సన్ని హితుల వద్ద, కోమటిరెడ్డి రాజగో పాల్‌రెడ్డి సన్నిహితుల వద్ద, యశ స్వినిరెడ్డి అత్త ఝాన్సిరెడ్డి వద్ద డబ్బు పట్టుకున్నట్లు భుజంగరావు అంగీకరించారు. తిరుపతన్న నేరాంగీకార ప్రకటన ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కంప్యూట ర్‌లలో డేటాతో పాటు డివైస్‌లను నాశనం చేసినట్లు తేలింది. ఇందు లో పేర్కొన్న అంశాలపై తగిన ఆదే శాలను జారీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీ ధర్మాసనాన్ని కోరింది. ఈ నేపద్యంలో హైకోర్టు ఈ కేసును విచారించేందుకు సుమోటో గా తీసుకోవడం సంచలన నిర్ణయమనే చెప్పాలి.
Decision of High Court Sumoto phone tapping