Demo Trains Cancellation: ప్రజా దీవెన, హైదరాబాద్: కాచిగూడ-నిజామాబాద్ మధ్య నడిచే (77601/77602)డెమూ రైళ్లను శనివారం నుంచి మార్చి నెలాఖరు దాకా రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-నిజామాబాద్ సెక్షన్‌లో ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగానే ఈ రైళ్లను రద్దు చేసినట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు. లింగంపల్లి-విజయవాడ మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (ఎంప్లాయీస్ ట్రైన్)కు అదనంగా మరొక ఏసీ చైర్‌కార్‌ను జత చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. శ నివారం విజయవాడ నుంచి లింగంపల్లి వచ్చే (12795) ఎక్స్‌ప్రెసలో, ఆదివారం లింగంపల్లి నుంచి విజయవాడ వెళ్లే (12796) ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అదనపు ఏసీ చైర్‌కార్ 15రోజుల పాటు అందుబాటులో ఉంటుందని సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.