–రాష్ట్రంలో రోజురోజుకు రెట్టింపవు తున్న డెంగి కేసులు
–అనధికారికంగా నాలుగింతల పైమాటే అంటున్న గణాంకాలు
–డెంగీ బాధితుల్లో చిన్నారులు, యుక్త వయస్సు వారే అధికులు
–వైద్యారోగ్య శాఖ నిద్రావస్థతో కన బడని నివారణ చర్యలు
–ప్రకటనలకే పరిమితమైన అధి కారులు,క్షేత్రస్థాయిలో భిన్న పరి స్థితులు
Dengue:ప్రజా దీవెన, హైదరాబాద్: దోమల నివారణ చర్యలు ముమ్మరం చేశామని, యాంటీ లార్వల్ ఆపరేషన్ (ఏఎల్ఓ), ఫాగింగ్ విస్తృతంగా చేస్తున్నామని, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామని అధికారులు ఆర్భాటంగా ఆయన మార్గాల్లో ప్రకటనలు జారీచేస్తున్న క్షతస్థాయి లో అందుకు భిన్నంగా పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ క్రమంలోనే డెంగీ(Dengue) కేసుల సంఖ్య తగ్గ కపోగా ఏకంగా మూడు నాలుగు రెట్లు అధికమవుతుండడం భయాం దోళనకు గురిచేస్తుంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే డెంగీ సీజన్‌గా చెప్పుకునే ఆగస్టు, సెప్టెంబర్, అక్టో బర్లో పరిస్థితి ఏంటని, ఆందోళన వ్యక్తం అవుతోంది. రోజుకు పది కేసుల నమోదు అధికారిక లెక్కల ప్రకారమే, అదే అనధికారికంగా ఈ సంఖ్య మూడు, నాలుగింతలు అధి కంగా ఉంటుందని సర్వోత్తర గణాం కాలు వెల్లడిస్తున్నాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నిత్యం 30 నుంచి 40 మందికిపైగా డెంగీ బారిన పడుతున్నారు. కరోనా అనంతరం ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే ప్రథమమని వైద్యారోగ్య శాఖ (Department of Health)వర్గాలు చెబు తున్నాయి. దోమల తీవ్రత తగ్గకపో తే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశముందని హెచ్చరిస్తున్నా రు.’
ప్రాథమిక దశలో ప్రమాణాల పాటింపు (Adherence to standards) మృగ్యం… వర్షాకాలం వాతావరణం దోమల వృద్ధికి అను వైన కాలం. నిల్వ ఉన్న నీటిలో ఉత్పత్తి అయ్యే లార్వా దోమగా రూపాంతరం చెందుతోంది. గుర్రపు డెక్కలుండే చెరువుల, మురుగు నీటి కాలువలే కాదు,ఇంటి పరిస రాల్లోని పూల కుండీల కింద ఉండే ప్లేట్లు, టైర్లు, కూలర్లు, తాగి పడేసిన కొబ్బరిబొండాలు, ప్లాస్టిక్ వస్తువుల్లో నిలిచే నీరు దోమల వృద్ధికి ఆవా సాలుగా మారుతున్నాయి. లార్వా దశలో దోమల వృద్ధిని నివారించ డంలో వైద్య ఆరోగ్యశాఖ (Medical Health Department)పూర్తిగా విఫలమవుతోంది. ప్రతి వారం నిర్ణీ త ప్రాంతాల్లో ఏఎల్ఓ, డ్రై డేలో భాగంగా నీటి నిల్వలు లేకుండా చూసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉన్నా యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న విమర్శలు మూట కట్టుకుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మెజార్టీ ఏరియాల్లో నెలకు ఒకటి, రెండు పర్యాయాలు కూడా ఏఎల్ఓ జరగడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇదే దోమల తీవ్రత (Mosquito intensity) పెరగడానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నా రు. ఎంత ఖర్చు చేసినా, ఎన్ని చర్య లు తీసుకుంటున్నా ఏటికేడు డెంగీ, మలేరియా కేసులు పెరుగుతు న్నా యి.నీటి నిల్వలు, చెత్త కుప్పలు, మురుగు పారిశుధ్య నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరగకపోవ డంతో రోడ్లపై చెత్తకుప్పలు పేరుకు పోతున్నాయి. పలు ప్రాంతాల్లో తర చూ మురుగు పరుగులు తీస్తోంది. నీటి నిల్వలు, చెత్త కుప్పలు మురు గు పరుగుతో నెలకుంటున్న అపరి శుభ్ర వాతావరణంతో సీజనల్ వ్యాధులు (Seasonal diseases) ముసురుకుంటున్నాయి. బస్తీ దవాఖానాలు, ప్రైవేట్ క్లినిక్ లకు వస్తున్న జ్వరపీడితుల సంఖ్య గణనీయంగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువగా చిన్నా రులు, యువకులు డెంగీ బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ‘ప్రజలూ బాధ్యతాయుతంగా ఉం డాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉం చుకోవాలి. నీటి నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకో వాలని సీనియర్ డాక్టర్ ఒకరు సూచించారు.