Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Dil Raj: రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పదవీ భాద్యతలు స్వీకరించిన దిల్ రాజ్

Dil Raj: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా వి. వెంకట రమణ రెడ్డి దిల్ రాజు బుధవారం ఉదయం పదవీ భాద్యతలు స్వీకరించారు. మాసా బ్ ట్యాంక్ లోని ఎఫ్.డీ.సి కార్యాల యంలో నేడు ఉదయం వేదపండి తుల మంత్రోచ్చారణల మధ్య పద వీ భాద్యతలు చేపట్టారు. ఈ సంద ర్బంగా సమాచార పౌర సంబంధా ల స్పెషల్ కమీషనర్ డా. హరీష్ దిల్ రాజును పుష్పగుచ్చాలతో అభినందించారు. ఈ కార్యక్ర మా నికి పలువురు సినీ రంగ ప్రముఖు లు హాజరై దిల్ రాజ్ ను అభినం దించారు.

పదవీ భాద్యతలు చేప ట్టిన అనంతరం, తెలంగాణా రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజ్ మాట్లాడుతూ తెలంగా ణా లో ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని తెలి పారు. తెలుగు చలన చిత్ర పరిశ్ర మకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఇండస్ట్రీ కి చేంది న సమస్యల పరిష్కారానికి ప్రాధా న్యత నివ్వనున్నట్తు చెప్పారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి చెంది న షూటింగ్స్ తెలంగాణా లో మరింత ఎక్కువగా జరిగే విధంగా ప్రయత్నిస్తానని, తెలంగాణాకు చెందిన సినిమాల ప్రోత్సాహానికి ప్రాధాన్యత నిస్తామని తెలిపారు. అదేవిధంగా ఎక్సహిబిటర్స్ సమస్యల పరిష్కారంతో పాటు, సినీ నిర్మాతలకు షూటింగ్ ల అనుమతులను సింగల్ విండో ద్వారా లభించేందుకు కృషి చేస్తానని దిల్ రాజ్ పేర్కొన్నారు.