–హైదరాబాద్‌లో నెల రోజుల పా టు 163 సెక్షన్ అమలు
–ధర్నాలు, రాస్తారోకోలు, బంద్ లకు దిగొద్దని ఆదేశాలు
–ధర్నాచౌక్‌లో టీజీఎస్పీ కాని స్టేబుళ్ల నిరసన అడ్డగింత
–21 మందిపై కేసు డిచ్‌పల్లి బెటా లియన్‌లో ర్యాలీ
Ditchpally Battalion: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) (TGSP) సిబ్బంది ఆందోళనల నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో నెల రోజులపాటు బీఎన్‌ఎస్ 163 సెక్షన్ (గతంలో 144 సెక్షన్)ను విధిస్తూ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (Police Commissioner CV Anand) సోమవారం ఆదేశాలు జారీ చేశారు. సిటీ కమి షనరేట్ పరిధిలో ధర్నాలు, రాస్తా రోకోలు, బంద్‌లపై నిషేదం విధిస్తు న్నట్లు ప్రకటించారు. ఈ ఆదేశాలు నవంబరు 28వ తేదీ వరకు అమ ల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఎవ రైనా అల్లరి మూకలు, అరాచక శక్తులు, అసాంఘిక కార్యకలాపాల కు పాల్పడే ఇతర గ్రూపులకు చెంది న వ్యక్తులు నగరంలో శాంతిభద్రత లకు విఘాతం కలిగించినా, ఫ్లకార్డు లు, జెండాలు పట్టుకొని నినాదా లు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, సభలు, సమావేశాలు నిర్వహిం చినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలీస్ అధికారులంతా (All police officers) హోంగార్డు లతో సహా.. విధుల్లోనే ఉంటారని తెలిపారు. సైనికోద్యోగులు, విద్యాశాఖకు చెందిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ సైతం విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. నెల రోజులపాటు.. చీమ చిటుక్కుమన్నా తెలిసేలా నగరంలో పటిష్టమైన నిఘాతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని ప్రాంతాల్లో అడుగ డుగునా పోలీస్ నిఘా ఉంటుందని ప్రకటించారు. అయితే ఈ ఆదేశా లు అమల్లో ఉండగానే.. పలువురు టీజీఎస్పీ కానిస్టేబుళ్లు ఇందిరా పార్కు ధర్నాచౌక్‌లో నిరసన తెలి పేందుకు వచ్చారు. వారిని దోమల గూడ పోలీసులు అడ్డుకొని అరెస్టు చే శారు. ఈ సందర్భంగా టీజీఎస్పీ కానిస్టేబుళ్లు, పోలీసులకు మద్య వాగ్వాదం, తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
21 మంది కానిస్టేబుళ్లపై కేసు..
ధర్నా చౌక్‌లో నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన 21 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై కేసు నమోదైంది. క్రిమినల్ కేసులతోపాటు 21 మంది సిబ్బందికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(2)(బి) ప్రకారం షోకాజ్ నోటీసులు (Show Cause Notices) కూడా జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు అదనపు డీజీపీ (బెటాలియన్) సంజయ్ జైన్ తెలిపారు. సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు సానుకూలంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు. మరోవైపు సచివాలయంలో భద్రతా విధులు నిర్వర్తించే సెక్యూరిటీ సిబ్బందికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్‌వో) నుంచి గట్టి హెచ్చరికలు జారీ అయ్యాయి. సచివాలయంలో టీజీఎస్పీ అధికారులు, సిబ్బందే భద్రతాపరమైన విధులు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో సీఎస్‌వో ఈ హెచ్చరికలు చేశారు.
‘‘సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మనపై చాలా మంది నిఘా ఉంటుంది. ఇక్కడ విధులు నిర్వహించేవారు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ పోస్టులు పెడుతున్నారు.. వంటి విషయాలను పరిశీలిస్తారు. టీజీఎస్పీ TGSP) అధికారులు, సిబ్బంది ఎవరైనా.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో కలుగజేసుకోవద్దు. సచివాలయంలో ఏ చిన్న తప్పిదం జరిగినా.. దాని ప్రభావం టీజీఎస్పీ వ్యవస్థపై పడుతుంది. సచివాలయం నుంచి అందరం వెళ్లిపోవాల్సి వస్తుంది’’ అని సీఎస్‌వో హెచ్చరించారు. సోమవారం నుంచి సచివాలయం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధి మేర 144 సెక్షన్ అమల్లో ఉందని తెలిపారు. ఐదుగురి కంటే ఎక్కువగా గుమిగూడవద్దని, ధర్నాలు, రాస్తారోకోలు, సచివాలయ ముట్టడిలాంటి వాటిలో పాల్గొన్నవారిపై చట్టపరమైన చర్యలుంటాయన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దని, ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు వంటి వాటిలో అనుమతి లేకుండా పాల్గొనవద్దు. పొరపాటున దొరికితే తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు. కాగా, బెటాలియన్ కానిస్టేబుళ్లు సోమవారం సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.