–18 ఏళ్ల పిన్న వయస్సులోనే చరిత్ర
ప్రజా దీవెన, హైదరాబాద్: ‘ప్రపంచ చెస్‌లో భారత్‌కు స్వర్ణయుగం’ అని దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ అన్న మాట నిజమేనని టీనేజ్ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేష్ నిరూపించాడు. 64 గళ్ల సామ్రాజ్యంలో విశ్వవిజే తగా ఆవిర్భవించడం ద్వారా అంతర్జాతీయ చదరంగ యవ నికపై మన స్థానాన్ని సమున్నతం చేశాడు. గురువారం సింగపూర్‌లో జరిగిన 14 గేమ్‌ల వరల్డ్ చాంపియ న్‌షిప్ ఫైనల్లో తెలుగు మూలాలు న్న చెన్నై చిన్నోడు గుకేష్ చైనాకు చెందిన డిఫెండింగ్ చాంపియన్, 32 ఏళ్ల డింగ్ లిరెన్‌ను ఓడించా డు.
ఆఖరి రౌండ్‌లో నల్లపావులతో చెక్ పెట్టాడు. మొత్తం 7.5 పాయిం ట్లతో టైటిల్ సొంతం చేసుకున్నా డు. పిన్నవయస్సులో ప్రపంచ చెస్ చాంపియన్‌గా నిలిచిన ఆటగాడి గా గుకేష్ చరిత్ర సృష్టించాడు.