Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BJP Election Campaign : డబుల్‌ డిజిట్‌ సీట్లే టార్గెట్‌

డబుల్‌ డిజిట్‌ సీట్లే టార్గెట్‌గా తెలంగాణ భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది.

తెలంగాణలో బీజేపీ హైకమాండ్ ఫోకస్
ప్రచారంలో దూకుడు పెంచిన నేతలు

ప్రజాదీవెన, హైదరాబాద్: డబుల్‌ డిజిట్‌ సీట్లే టార్గెట్‌గా తెలంగాణ భారతీయ జనతా పార్టీ (BJP) దూకుడు పెంచింది. అభ్యర్థుల నామినేషన్‌కు జాతీయ నేతల రాకతో కమలం పార్టీలో ఇప్పటికే జోష్‌ కనిపిస్తోంది. అలాగే అగ్రనేతలతో కూడా ఎక్కువ సభలు నిర్వహించి.. 10కిపైగా ఎంపీ సీట్లు (MP) గెలవాలని రాష్ట్ర నేతలు ప్లాన్‌ చేస్తున్నారు. తెలంగాణపై బీజేపీ హైకమాండ్‌ స్పెషల్‌ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో డబుల్‌ డిజిట్‌ ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తోంది.

ఇప్పటికే నామినేషన్‌ కోసం బీజేపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ర్యాలీలు, రోడ్‌ షోలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు హాజరవుతున్నారు. సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి (Kishan reddy) నామినేషన్ వేయగా.. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్రమంత్రి పియూష్‌ గోయల్, ఎంపీ లక్ష్మణ్‌ హాజరైయ్యారు.

ఇవాళ భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్‌ నామినేషన్‌ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి జైశంకర్‌ హాజరవుతారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah)ఎల్లుండి తెలంగాణలో పర్యటిస్తారు. మెదక్ పార్లమెంట్(Parliament) పరిధిలోని సిద్ధిపేటలో బహిరంగ సభకు హాజరుకానున్నారు అమిత్‌ షా. పార్టీ శ్రేణులతో సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.

మే ఫస్ట్‌ వీక్‌లో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో వీలైనన్ని ఎక్కువ సభలు, రోడ్‌ షోలు నిర్వహించేలా బీజేపీ రాష్ట్ర నేతలు ప్లాన్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరుగనుండగా.. నాలుగో దశలో మే 13న తెలంగాణలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న కౌంటింగ్‌ నిర్వహిస్తారు.

Double digit seats are target