–తెలంగాణలో ఒకటి తో పాటు 12 స్థానాలకు ఈసీ నోటిఫికేషన్
–ఈ నెల 21 వరకు నామినేషన్ల దాఖలు, 27న ఉపసంహరణ గడువు
–సెప్టెంబర్ 3న పోలింగ్ , ఫలితాలు
–తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గా అభిషేక్ సింఘ్వీ
EC notification:ప్రజా దీవెన, హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికలకు (Rajya Sabha Elections) రంగం సిద్ధ మైంది. తెలంగాణలోని ఒక రాజ్య సభ సీటుతో పాటు వివిధ రాష్ట్రా ల్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. . ఈ మేర కు బుధవారం నోటిఫికేషన్ విడు దల చేసింది. నోటిఫికేషన్ వెలువ డిన దగర నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ కొన సాగనున్నట్లు కమిషన్ ప్రకటిం చిం ది. ఈ నెల 27 వరకు నామినేషన్ ఉప సంహరణకు గడువు ఇచ్చారు. సెప్టెంబర్ 3న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.
అదే రోజు ఓట్ల లెక్కింపు (Counting of votes)చేపట్టి, ఫలితాలు ప్రకటించనున్నారు. 9 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 12 స్థానాలకు ఈ ఎన్నికలు జరుగనున్నాయి, అస్సాం, బీహార్,హర్యానా, మధ్యప్ర దేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర (Assam, Bihar, Haryana, Madhya Pradesh, Maharashtra, Rajasthan, Tripura) రాష్ట్రాల నుంచి 10 మంది సభ్యు లు లోక్సభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నికలు అనివార్య మ య్యాయి. అలాగే, తెలంగాణ, ఒడిశా నుంచి ఒక్కొక్కరు తమ సభ్యత్వానికి రాజీ నామా చేయ డంతో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వసించనున్నారు. తెలంగా ణలోబీఆరెస్ నుంచి కాంగ్రెస్లో చేరిన రా రాజ్య సభ సభ్యుడు కే.కేశవరావు రాజీనా మాతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. కేకే స్థానంలో (KK position)సీని యర్ నేత అభిషేక్ మను సింఘ్వీని అభ్యర్థిగా కాంగ్రెస్ (Congress)అధిష్ఠానం ప్రక టించింది. ఈ మేరకు ఏఐసీసీ అధికార ప్రకటన విడుదల చేసింది.