Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Engineering Seats Counselling: ఇంజనీరింగ్ వెబ్ అఫ్షన్లకు నేడే ఆఖరు

— 70 వేలకు పైగా సీఎస్ఈ సీట్లే,
కన్వీనర్ కోటా కింద 73 వేలు భర్తీ
–సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వెల్లడి

Engineering Seats Counselling:ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 178 ఇంజ నీరింగ్ కళాశాలల్లో 1,01,661 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఇందులో 72,741 సీట్లు కౌన్సెలింగ్ (Seats Counselling)ద్వారా భర్తీ చేయనున్నట్టు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ ఇంజ నీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నెట్వర్క్, కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ (Artificial Intelligence, Computer Engineering, Computer Science and Network Engineering, Computer Science and Data Science) వంటి కోర్సు ల్లో 70,248 సీట్లు అందుబాటులో ఉండగా కన్వీనర్ కోటా 49,786 సీట్లు భర్తీ చేస్తున్నట్లు ఆమె పేర్కొ న్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో అత్యధికంగా 32,364 సీట్లు ఉండగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లర్నింగ్ ఏఐఎంల్) 16,380 సీట్లు ఉన్నాయని, ఇందులో 11,574 సీట్లు కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్)లో 9,510 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్లో 1,950 సీట్లు భర్తీ చేస్తున్నామని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 5,250 సీట్లు, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ లో 360 సీట్లు ఉన్నాయని తెలిపారు. కంప్యూటర్ ఇంజనీరింగ్ (సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్) లో 180 సీట్లు అందుబాటులో ఉన్నాయని దేవసేన (Devasena) తెలిపారు.

అందుబాటులోని ఇంజనీరింగ్ సీట్లు…

ఇంజ నీరింగ్ లో (Engineering ) 5880 సీట్లు, బయో మెడికల్ ఇంజనీరింగ్లో 90 సీట్లు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వీఎల్సీఐ డిజైన్ అండ్ టెక్నాలజీలో 60 సీట్లు ఉన్నాయని ఆమె పేర్కొ న్నారు. సి విల్, మెకానికల్ సంబం ధిత కోర్సు ల్లో 9,190 సీట్లు ఉండ గా ఇందులో 6,805 కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తు న్నామని తెలి పారు. సివిల్ ఇంజనీ రింగ్లో అత్య ధికంగా 4,440 సీట్లు, మెకానికల్ ఇంజనీరింగ్లో 4,170, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో 240 సీట్లు (seasts)ఉన్నా యని పేర్కొన్నారు. కెమికల్ ఇంజనీరింగ్ లో 240, బయో టెక్నాలజీలో 150, మైనింగ్ ఇంజనీరింగ్ లో 330, ఫుడ్ టెక్నాలజీలో 90, బిల్డింగ్ సర్వీసెస్ ఇంజనీరింగ్లో 60, ఫార్మాసుటికల్ ఇంజనీరింగ్లో 120 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొత్తగా 2640 సీట్ల అనుమతికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతి ఇచ్చిందని, వాటిని కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నామని తెలిపారు.

పెరిగిన సీట్లను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు వెబ్ ఆప్షన్లను (Web Options) ఎంపిక చేసుకోవాలని దేవసేన తెలిపారు. ఇప్పటిదాకా 95,383 మంది వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకున్నారని, ఈ విద్యార్థులు 61,57,711 ఆప్షన్లు ఇచ్చారని తెలిపారు. వెబ్ ఆప్షన్లను బుధవారంలోపు ఇవ్వాలని ఇదే చివరి తేదీగా నిర్ణయించడం జరిగిందని దేవసేన వివరించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ విభాగాల్లో 20,940 సీట్లు ఉండగా ఇందులో 15,104 కన్వీనర్ కోటాలో ఉన్నాయని చెప్పారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో అత్యధికంగా 14.520 సీట్లు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయన్నారు.