Medigadda:మేడిగడ్డలో నిపుణుల బృందం అధ్యయనం
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ, అన్నారం సరస్వతి బ్యారేజీలను పుణేకు చెందిన కేంద్ర జల, విద్యుత్ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్ ఎస్) నిపుణుల బృందం బుధవారం పరిశీలించింది.
మేడిగడ్డ, అన్నారం సరస్వతి బ్యా రేజీ వద్ద కూడా పరిశీలన
డిజైన్లు, లీకేజీలపై వివరాల సేకర ణ,నేడు సుందిళ్ల బ్యారేజీకి బృందం
ప్రజా దీవెన, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో(Kaleshwaram project) భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ,(Medigadda Lakshmi Barrage) అన్నారం సరస్వతి బ్యారేజీలను పుణేకు చెందిన కేంద్ర జల, విద్యుత్ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్ ఎస్) నిపుణుల బృందం బుధవారం పరిశీలించింది. ఆ సంస్థలోని భూ భౌతిక, భూసాంకేతిక, నాన్ డిస్ట్ర క్టివ్(Non-destructive) విభాగాలకు చెందిన ముగ్గురు నిపుణులు జె.ఎస్.ఎడ్లబాడ్కర్, డాక్టర్ ధనుంజయ్ నాయుడు, డాక్టర్ ప్రకాష్ పాలె మధ్యాహ్నం మూడున్నర గంటలకు మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకుని ప్రాజెక్టు ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధు లతో అరగంటపాటు భేటీ అయ్యా రు.
ఆ తరువాత దెబ్బతిన్న బ్యారే జ్‌లోని ఏడవ బ్లాకులో 19, 20, 21 పియర్లను, ఆ ప్రాంతంలో చేపడు తున్న పనులను పరిశీలించారు. ముఖ్యంగా ఏడోబ్లాక్‌లో పియర్లు(Pears)కుంగిపోవడానికి కారణాలపై అధ్య యనం చేశారు. తొలుత పైభాగంలో పిల్లర్లను, తర్వాత డ్యామ్ అంత ర్భాగంలోని ఎగువ భాగాన కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తర్వా త దిగువన జల ప్రవాహం వెళ్లే మా ర్గాలను, భూ భౌతిక స్థితిగతులను సాంకేతికంగా అధ్యయనం చేయ డంతో పాటు ఏడో బ్లాక్ మొత్తాన్నీ ఫొటోలు(Photos) తీసి సమాచారాన్ని సేకరిం చారు. దాదాపు గంటన్నరపాటు బ్యారేజీని పరిశీలించిన తర్వాత అన్నారం సరస్వతీ బ్యారేజీ వద్దకు చేరుకున్నారు.
అక్కడ కూడా అప్ స్ట్రీమ్, డౌన్‌స్ట్రీమ్‌లలో(Downstream)దెబ్బతిన్న అఫ్రాన్లు, సీసీ(CC) బ్లాకులు పరిశీ లించారు. ఏయే బ్లాకుల వద్ద సీపే జీలు ఏర్పడ్డాయని, వాటి పరిణా మాలు ఏమిటనే వివరాలు సేకరిం చారు. లీకేజీల సమస్యకు సంబం ధించి అధికారులు తీసుకున్న చర్య లపై రామగుండం చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి ద్వారా వివరాలు తెలుసుకున్నారు.
Engineers observation medigadda