Tummala Nageswara Rao:సరిపడా సన్నాలు సమకూర్చేందుకే రైతాంగానికి బోనస్
రాష్ట్రం లో సన్న రకాల సాగును పెంచేం దుకే రూ.500 బోనస్ ప్రకటించా మని తెలిపారు.
ప్రజలకు రేషన్‌గా సన్న బియ్యం పంపిణీయే మా లక్ష్యం
రాబోయే రోజుల్లో దొడ్డు రకం వడ్లకూ ఇవ్వబోతున్నాం
దొడ్డు వడ్లకే పాలీష్‌తో మధ్యాహ్న భోజనపథకానికి వాడుతున్నా రు
తుమ్మల
ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో సన్న రకాల సాగును పెంచేం దుకే రూ.500 బోనస్ ప్రకటించా మని తెలిపారు. గత ప్రభుత్వం సన్న బియ్యం పేరుతో దొడ్డు వడ్లకే పాలీష్ వేసి అంగన్వా డీలు, మధ్యాహ్న భోజన పథకానికి వినియోగించిందని గుర్తు చేశారు. పేదలకు మేలు చేయాలనే సంక ల్పంతో రేషన్ దుకాణాల్లో సన్నబి య్యం పంపిణీ చేయాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా సన్న వడ్లను ఉత్పత్తి చేసుకునేందుకు బోనస్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు స్పష్టం చేశారు.
కేసీఆర్ పాలనలో పంటల బీమా పథకం అమలుకు నోచుకోలేదని, తాము రూ.3వేల కోట్లతో ఆ పథ కాన్ని అమలు చేయబోతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) పేర్కొన్నారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చిన ఘనత కూడా తమదేనని స్పష్టం చేశారు. భవిష్యత్తులో దొడ్డు రకం వడ్లకు సైతం బోనస్ పథకాన్ని అమలుచేస్తామని ప్రకటించారు. ఇప్పటికైనా బీఆర్‌ఎస్(BRS) నేతలు తప్పుడు ప్రకటనలు మానుకోవాల ని సూచించారు. రైతులు కూడా గత ప్రభుత్వం ఎలా పనిచేసింది, ప్రస్తు ప్రభుత్వం ఎలా పనిచేస్తున్న దో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
అధికారంలో ఉన్నప్పుడు రైతులను కాల్చుకుతిన్నది కేసీఆరేనని, అందు కే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడగొ ట్టి ఇంట్లో కూర్చోబెట్టారని తుమ్మల పేర్కొన్నారు. 2020లోనే రైతులకు బోనస్ ఇస్తామని ప్రకటించిన కేసీఆ ర్(KCR) ఆ తర్వాత మూడేళ్లు అధికారం లో ఉండీ నయా పైసా ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు తాము సన్న రకం ధాన్యానికి బోనస్ ఇస్తా మంటే బీఆర్‌ఎస్ నేతలు కొత్త నాట కాలకు తెరలేపారని దుయ్యబ ట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల(Assembly elections)నాటికి హామీలన్నీ పూర్తి చేస్తామని, లేకపోతే ప్రజలను ఓట్లు అడగ బోమని స్పష్టం చేశారు. కేసీఆర్ నిర్వాకం కారణంగా అస్తవ్యస్తమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీల అమలు ప్రక్రియను ప్రారంభిం చామని గుర్తు చేశారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే కాంగ్రెస్(Congress) పాలన లో ధాన్యం సేకరణ వెయ్యి పాళ్లు నయమనే అభిప్రాయంతో తెలం గాణ(Telangana) రైతులు ఉన్నారని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు జిల్లాకో ఐఏఎస్ అధికారిని నియ మించామని, ఈ సారి 4 లక్షల టన్నుల ధాన్యం అదనంగా కొనుగో లు చేస్తామని తెలిపారు. గతంలో క్వింటాల్‌కు 7–10 కిలోల వరకు తరుగు తీసి మిల్లర్లు దోపిడీ చేసే వారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. గతంలో ధాన్యం డబ్బు చెల్లించడానికి 45రోజులు పట్టేదని, ఇప్పుడు 5 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నామని పేర్కొన్నారు.
Farmers get bonus for providing enough grain