Fire Accident: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ నాచారoలోని మల్లాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో (Petrol station) పెట్రోల్ పడుతుం డగా గంజాయి మత్తులో వున్న ఆకతాయిలు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా మంటలు చెలరేగ డంతో అందరూ షాకయ్యారు. దీం తో అప్రమత్తమైన పెట్రోల్ బంక్ (Petrol station) సిబ్బం ది నిప్పును ఆర్పేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని యువకులను అదుపు లోకి తీసుకున్నారు. నాచారం పోలీస్ స్టేషన్ (Nasaram police station) పరిధిలో నిన్న సాయంత్రం మల్లాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వాహనదా రులతో రద్దీగా ఉంది.
బంక్ సిబ్బం ది బిజీగా ఉన్నారు. ఈ సమయం లో స్కూటీపై (scotty) వచ్చిన యువకులు పెట్రోలు కావాలన్నారు. దీంతో సిబ్బంది పెట్రోల్ నింపుతుండగా అందులో ఓ యువకుడు ఒక్క సారిగా జేబులో ఉన్న లైటర్ తీసి నిప్పంటించాడు. అంతే ఒక్కసా రిగా మంటలు అంటుకున్నాయి. భయంతో అక్కడ ఉన్న వాహన దారులంతా తలోదిక్కుకు పరు గులు తీశారు. అయినా అంతటి తో ఆగని ఆకతాయి, నిప్పుచెలరే గుతుండగానే దానిని మరోవైపు కాలితో నెట్టుతూ పైశాచిక ఆనం దం పొందాడు. తీవ్ర భయాందోళన కు గురైన సిబ్బంది వెంటనే అప్రమ త్తమై ఫైర్ ఫోమ్‌తో మంటలు ఆర్పి వేశారు.దీంతో పెట్రోల్ బంక్‌లో (Petrol station) ఉన్నవారందరూ ఊపిరి పీల్చు కున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించగా పోలీసు లు ఆకతాయిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.