Fire Accident:ప్రజా దీవెన, హైదరాబాద్: పాతబస్తీ జియాగూడ (Old town Jiyaguda) పరిధి వెంక టేశ్వర నగర్‌లోని ఓ అపా ర్ట్‌మెంట్ లో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘట నలో తండ్రి, పదేళ్ల కుమార్తె చెంద గా, మరో ఇద్దరు గాయపడ్డారు. మొదట అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఫర్నీచర్ తయారీ ఫ్యాక్టరీ (Furniture manufacturing factory) లో మంటలు చెలరేగాయి. క్రమంగా ఆ బిల్డింగ్ మొత్తానికి వ్యాపించా యి. స్థానికులు మంటలు ఆర్పేందు కు విఫలయత్నం చేశారు.పది ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది (Firefighters)పది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అపార్టుమెంటు మొదటి, రెండో అంతస్తుల్లో ఉన్న 20 మందిని రక్షించారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన నలు గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని పోలీసులు ఉస్మానియా దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక శివప్రియ (10) మృతి చెందింది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం హాస్ప టల్ కు తరలించారు అక్కడ చికిత్స పొందుతూ శివప్రియ తండ్రి శ్రీనివాస్ కన్నుమూశారు దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు (police) దర్యాప్తు చేస్తున్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.