Firing:ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మరోసా రి కాల్పుల (Firing) కలకలం రేకెత్తింది. నాం పల్లి రైల్వేస్టేషన్ దగ్గర అనుమానా స్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్య క్తులను పోలీసులు ప్రశ్నించడంతో పోలీసులపై అందులోని ఒక వ్యక్తి గొడ్డలితో దాడికి యత్నించగా మరొక వ్యక్తి వ్యూహాత్మకంగా రాళ్లతో పోలీసులపై ఎదురు దాడికి దిగా డు. పోలీసులతో ఎదురుదాడి ప్రయత్నాల్లో భాగంగా తప్పించుకు నేoదుకు పరుగులు పెడుతున్న సమయంలో పోలీస్ డెకాయ్ బృందం అనివార్యంగా కాల్పులు జరిపింది.హైదరాబాదులోని నాంపల్లి రైల్వే స్టేషన్ (Nampally Railway Station) వద్ద సంచరిస్తున్న వ్యక్తి ని ఆరా తీసే ప్రయత్నంలో సదరు ఇద్దరు వ్యక్తులు పోలీసుల తో తలపడుతూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు.
నాంపల్లి పోలీసులు (Nampally Police), యాంటీ డెకయిట్ టీమ్ (Anti-cheating team)సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సర్చ్ లో వారిపై కాల్పులు జరిపారు. హైదరాబాద్ సీపీ ఆదేశాల మేరకు నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద తనిఖీలు చేపట్టగా రాత్రి సమ యంలో ప్రయాణికులు పడుకున్న ప్పుడు వారిపై దాడి చేసి డబ్బు లు, సెల్ ఫోన్లు, బంగారు ఆభర ణాలు దోచుకుంటున్నట్లు సమా చారంతో నిన్న అర్ధరాత్రి సమయం లో తనిఖీ చేపట్టారు. ఈ సమ యంలో అనుమానాస్పదంగా తిరు గుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీ సులు ప్రశ్నించారు. మాంగర్ బస్తికి చెందిన వారిద్దరూ పోలీసుల పై గొడ్డలితో దాడికి యత్నించారు. సెల్ఫ్ డిఫెన్స్ కోసం పోలీసులు జరిపిన కాల్పులలో రాజు అనే వ్యక్తికి తొడలో దూసుకెళ్లిన బుల్లెట్ అతన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. మరో వ్యక్తి అయ్యా న్ ను నాంపల్లి పోలీసులు అదుపు లోకి తీసుకొని విచారిస్తున్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
