Gang rape: ప్రజా దీవెన, హైదరాబాద్: పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలపై మృగాళ్లు సామూహిక అత్యా చారం (Gang rape) పాల్పడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదుగురు యువకులను అరెస్టు చేసిన పోలీ సులు, వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సైదాబాద్ పోలీసుల (Saidabad Police) కథనం ప్రకారం.. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలో ఓ ప్రయివే ట్ సంస్థ బాలికల కోసం ఓ పునరా వాస కేంద్రాన్ని నడుపుతోంది. ఈ కేంద్రంలో జనగామ ప్రాంతానికి చెందిన ఓ బాలిక (14) మూడు నెలల నుంచి ఆశ్రయం పొందుతుం డగా గత నెల 18న మల్కాజిగిరికి చెందిన మరో బాలిక (15) చేరింది. తల్లిదండ్రులు ఉన్నా, వేర్వేరు కార ణాలతో బాలికలను ఆశ్రమంలో (Girls’ Asylum)చేర్పించారు.ఈ క్రమంలో బాలికల మధ్య స్నేహం ఏర్పడింది. దీంతో అక్కడి నుంచి పారిపోవాలని భావించిన ఇద్దరూ సెప్టెంబరు 24న కిటికీ నుంచి దూకి తప్పించుకు న్నారు. దీని గురించి సైదాబాద్ పోలీసులకు నిర్వాహకులు ఫిర్యా దు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపె ట్టారు. సెప్టెంబరు 24 న రాత్రి 8 గంటలకు బాలికులు (girls) ఇద్దరూ జనగామ చేరుకున్నారు. బస్టాండ్ సమీపంలో పాన్‌షాప్ నడుపుతోన్న సాయిదీప్ అనే యువకుడి దగ్గర ఫోన్ తీసుకున్న ఓ బాలిక తనకు తెలిసిన నాగరాజుకు ఫోన్ చేసింది. అక్కడకు వచ్చిన అతడు.. ఆ బాలికను ఓ గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
తన స్నేహితురాల్ని నాగరాజు (Nagaraju)తీసుకెళ్లడంతో బస్టాండ్ దగ్గర మరో బాలిక ఒంటరిగా మిగిలింది. దీన్ని గమనించిన సాయిదీప్ ఆమెకు ఆశ్రయం కల్పిస్తానని నమ్మబలికాడు. పక్కనే ఉన్న బేకరీకి తీసుకెళ్లి.. బేకరీ నిర్వాహకుడు రాజుతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. నాగరాజు తన వెంటనే తీసుకెళ్లిన బాలికను సెప్టెంబరు 25న ఉదయం తీసుకొచ్చి బస్టాండ్ దగ్గర వదిలిపెట్టాడు.ఆ బాలికలు విష యం తెలుసుకున్న సాయిదీప్, రాజుల స్నేహితులు అఖిల్, రోహిత్లు వారిని హైదరాబాద్ తీసుకెళ్తామని నమ్మించారు. ఈ క్రమంలో కారులో ఎక్కించుకుని మార్గంమధ్యలో వారిపై పలుమా ర్లు అత్యాచారం చేసి తిరిగి బస్టాండ్ దగ్గరే వదిలి పరారయ్యారు. ఈ క్రమంలో బాలికలు పోలీసుల కంట బడటంతో అదే రోజు సైదాబాద్ (Saidabad Police) కు తీసుకొచ్చి పునరావాస కేంద్రంలో అప్పగించారు. వారిని అరెస్ట్ చేసి, పోక్సో కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.