Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ganja Chocolates: అంతర్రాష్ట్ర హెరాయిన్ ముఠా ఆటకట్టు

–మల్కాజిగిరిలో గంజాయి చాక్లెట్ల సీజ్‌
–రూ.7 కోట్ల విలువైన కిలో హెరా యిన్‌ను సీజ్‌ చేసిన పోలీసులు

Ganja Chocolates: ప్రజా దీవెన, హైదరాబాద్‌: హైదరాబాద్ మహానగరంలో హెరాయిన్‌ (Heroin) విక్రయించే ముఠా ఆటను తెలం గాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూ రో(టీజీ న్యాబ్‌), శంషాబాద్‌ ఎస్‌వో టీ, మాదాపూర్‌ పోలీసులు కట్టించా రు. ఈ ముఠా నుంచి రూ.7 కోట్ల విలువైన కిలో హెరాయిన్‌ను సీజ్‌ చేశారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబా ద్‌ పోలీసు కమిషనర్‌ అవినాశ్‌ మొహంతి వివరాలను వెల్లడించా రు. రాజస్థాన్‌లోని నాగోర్‌ జిల్లా రాథోడ్‌కెవా ప్రాంతానికి చెందిన సంతోష్‌ ఆచార్య దేశవ్యాప్తంగా డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ను (drugs) నడుతుపుతు న్నాడు. డ్రగ్స్‌ కేసుల్లో ఇతను జోధ్‌ పూర్‌ జైలులో ఉన్నా లోపలి నుంచే తన నెట్‌వర్క్‌ను నడుపుతున్నా డని చెప్పారు. నాగోర్‌ జిల్లాకు చెం దిన నేమీచంద్‌ భాటీ, నర్పత్‌సింగ్‌ ద్వారా ఇతను హైదరాబాద్‌కు హెరాయిన్‌ సరఫరా చేస్తున్నారని తెలిపారు.

వీరిద్దరూ బస్సుల్లో ప్రయాణిస్తూ హెరాయిన్‌ను తరలిస్తారని, నేమీచంద్‌కు నగరం లోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉండే అతని సోదరుడు అజయ్‌ భాటీ, చౌటుప్పల్‌కు చెందిన హరీశ్‌ సాల్వీ సహకరిస్తున్నారని, వీరంతా శని వారం శిల్పారామం వద్ద కస్టమర్లకు హెరాయిన్‌ విక్రయించేందుకు సిద్ధ మయ్యారని, ఈ గ్యాంగ్‌ కదలికలపై ఉప్పందుకున్న టీజీ న్యాబ్‌, శంషా బాద్‌ ఎస్‌వోటీ, మాదాపూర్‌ పోలీ సులు (TG NYAB, Shamsha Bad SWOT, Madapur Police) నలుగురిని అరెస్టు చేసి, వారి వద్ద 250 గ్రాముల చొప్పున నాలు గు ప్యాకెట్లలో ఉన్న కిలో హెరా యిన్‌ ను స్వాధీనం చేసుకు న్నారు. ఇదిలా ఉండగా హెరాయిన్‌ సర ఫరా చేస్తున్న ముగ్గురు ర్యాపిడో డ్రైవర్లను మహేశ్వరం ఎస్‌వోటీ, ఎల్‌బీనగర్‌, సరూర్‌నగర్‌, మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థా న్‌లోని బార్మేర్‌ జిల్లా గూడ్మలానీ గ్రామానికి చెందిన అన్నదమ్ములు రమేశ్‌ కమార్‌, మాహదేవ్‌ రామ్‌ నగరంలోని ఎర్రగడ్డలో ఉంటూ.. ర్యాపిడో డ్రైవర్లుగా పనిచేస్తు న్నారు. వీరిద్దరూ కలిసి.. రాజస్థా న్‌కు చెందిన వీరంగోయల్‌తో ముఠాగా ఏర్పడ్డారు.

వీరంతా హెరాయిన్‌కు అలవాటు పడి.. ఏడాది కాలంగా విక్రయాలను ప్రారంభించారు. రాజస్థాన్‌కు చెందిన దినేశ్‌కల్యాణ్‌ అనే వ్యక్తి నుంచి హెరాయిన్‌ కొనుగోలు చేసి, నగరంలో విక్రయిస్తున్నారు. ఈ దందాపై సమాచారం అందుకున్న పోలీసులు రమేశ్‌, మహదేవ్‌లను అరెస్టు చేసి 34 గ్రాముల హెరా యిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్‌, మల్కాజిగిరి ఎక్సైజ్‌ పోలీ సులు నిర్వహించిన దాడుల్లో 1.7 కిలోల గంజాయి, 390 గ్రాముల గంజాయి చాక్లెట్లను సీజ్‌ చేశారు. ఘట్‌కేసర్‌లోని లారిసార్ట్‌లో అను మతుల్లేకుండా మద్యం పార్టీ జరు గుతోందని కీసర ఎక్సైజ్‌ పోలీ సులకు సమాచారం అందింది. వారు రిసార్టుపై దాడిచేయగా గంజాయి, గంజాయి చాక్లెట్లతో పాటు 2.6 లీటర్ల లిక్కర్‌ను స్వాధీనం చేసుకుని, రిసార్ట్‌ యజమానిపై కేసు (case)నమోదు చేశారు.