–కేంద్రానికి అప్పిలు చేసిన సిఎస్ శాంతికుమారి
GHMC: ప్రజా దీవెన, హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు (Secunderabad Cantonment Board) పరిధిలో సాధారణ ప్రజలు నివసించే ప్రాంతా లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) (ghmc)లో విలీ నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (Shantikumari) కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. కంటో న్మెంట్ బోర్డుల పరిధిలోని ప్రాంతాలను మున్సిపాలిటీల్లో విలీనం (Merger of municipalities) చేసే అంశంపై కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి ఎ.గిరిధర్ న్యూఢిల్లీ నుంచి వివిధ రాష్టాల్ర ఉన్నతాధికారులతో మంగ ళవారం వర్చువల్ సమీక్ష నిర్వ హించారు. ఈ సమీక్షలో పాల్గొన్న సీఎస్ శాంతికుమారి రాష్ట్ర ప్రభు త్వ వైఖరిని కేంద్ర మంత్రికి (Union Minister) తెలియజేశారు. బ్రిటిష్ పాలన నుంచి దేశంలో కొనసాగుతున్న కంటోన్మెంట్ బోర్డులను (Cantonment Boards) రద్దు చేయాలని కేం ద్రం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర మంత్రి గిరిధర్ సందర్భంగా తెలిపా రు. అందువల్ల విలీన పక్రియను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్రాల ను కోరారు. ఇందుకు స్పందించిన సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ కేంద్ర ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమ్మతి తెలిపిందని వివ రించారు.కంటోన్మెంట్ పరిధి నుంచి సాధారణ ప్రజలు నివసించే ప్రాంతా లు (సివిల్ ఏరియా) తొలగింపు విధివిధానాల ఖరారుకు కేంద్రం ఏర్పాటుచేసిన కమిటీ రాష్ట్ర ప్రభుత్వంతో ఇంకా చర్చించలేదని తెలిపారు. విలీన పక్రియను వేగ వంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి పని చేస్తున్నదని చెప్పారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, మున్సిపల్, కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.