–ప్లాన్ ప్రకారం నిత్యకృత్యం చేసుకున్న హోంగార్డు
–అదుపులోకి తీసుకొని విచా రిస్తున్న పోలీసులు
GHMC: ప్రజాదీవెన, హైదరాబాద్: హైదరాబాద్లోని కేబీఆర్ పార్కు (KBR Park) ముందున్న జీహెచ్ఎంసీ నడకదారిలో యువతీయువకులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న హోంగార్డును (home guard)పోలీసులు అరెస్ట్ చేశారు. కేబీఆర్ ఉద్యానం వద్ద పెట్రోల్ వాహనంలో (Petrol vehicle) ముద్దం శ్రీనివాస్ హోంగార్డుగా పనిచేస్తున్నాడు. యాదగిరి అనే వ్యక్తిని సహాయకుడిగా పెట్టుకున్నాడు. నడకదారిలో యువతీయువకులు జంటగా కనిపిస్తే తనకు సమాచారం ఇవ్వాలని అతడికి చెప్పాడు యాదగిరి ప్రేమజంటలు కనిపించగానే హోంగార్డుకు సమాచారం ఇస్తాడు. అప్పుడు శ్రీనివాస్ వాళ్ల వద్దకు వెళ్లి బెదిరించి డబ్బు వసూల్ చేస్తాడు.
ఇటీవల ఓ జంటను డబ్బివ్వాలని బెదిరించగా, అతడు తన వద్ద డబ్బు లేదని చెప్పాడు. అయితే ఏటీఎంలో డ్రా చేసి ఇవ్వాలని యువకుడిని బలవంత పెట్టడంతో ఆ యువకుడు పోలీసులకు (police)ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని హోంగార్డుతో పాటు అతడి సహాయకుడిని అరెస్ట్ చేశారు.