–గోల్కొండ శ్రీ శ్రీ జగదాంబిక మహంకాళీ బోనాలు షురూ
–తెలంగాణ ప్రభుత్వం తరఫున స్పీకర్ గడ్డం ప్రసాద్ , మంత్రులు కొండ సురేఖ , పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పణ
—
—
Golconda bonalu:ప్రజా దీవెన, హైదరాబాద్:
ఆషాఢమాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగరంలో బోనాల సందడి నెలకొంది. గోల్కొండ శ్రీ శ్రీ జగదాంబిక మహంకాళీ గోల్కొండ బోనాల (Golconda bonalu)ఉత్సవాల నిర్వాహకుల ఆధ్వర్యంలో ఆదివారం లంగర్ హౌజ్ చౌరస్తాలో (langar house chowrasta) ప్రారంభమ య్యాయి.తెలంగాణ ప్రభుత్వం తరఫున స్పీకర్ గడ్డం ప్రసాద్ , మంత్రులు కొండ సురేఖ , పొన్నం ప్రభాకర్ , మేయర్ గద్వాల్ విజయలక్ష్మి , డెప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి , ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ , ప్రిన్సిపాల్ సెక్రెటరీ శైలజ , కలెక్టర్ అనుదీప్ లు బోనాలను అధికా రికంగా ప్రారంభించారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేశారు.
అక్కడి నుంచి పట్టు వస్త్రాల ఊరేగింపు, తొట్టెల ఊరేగింపు గొల్కొండ కోట వరకు కొనసాగాయి. ఈ కార్యక్రమం మొత్తం దేవాదాయ (Deva Daya shakha) ఆధ్వర్యంలో నిర్వహించారు. కాగా చారిత్రక గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించడంతో బోనాల ఉత్సవాలు ప్రారంభమ య్యాయి.9 వారాల పాటు బోనాల ఉత్సవాలు జరుగుతాయి. గోల్కొం డ (Golconda) కోటలోనే బోనాలు ముగింపు ఉత్సవాలు కొనసాగుతాయి.
*ఆషాడ బోనాల కథాకమీషు…*
భాగ్యనగరంలో ఆషాఢ మాసం బోనాల పండగ (bonala festival)సందడి షురూ అయ్యింది. ఆషాఢ మాసంలో వచ్చే ఈ పండుగతో జంట నగరాలు నెలరోజుల పాటు కోలహాలంగా మారనున్నాయి. ఈ సందర్భంగా బోనాల జాతర ప్రాముఖ్యతలేంటో తెలుసుకుందాం, భాగ్యనగరంలో ప్రతి సంవత్సరం మొట్టమొదటగా గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి బంగారు బోనంతో సందడి షురూ అవుతుంది. ఇక్కడి నుంచే బోనాల సంబురాలు షురూ అవుత య్. ఒకప్పుడు తెలంగాణ(Telangana) వ్యాప్తంగా ప్రతి ఒక్క ఊరిలో బోనాల పండుగను ఘనంగా జరుపుకునే వారు. అందుకే ఈ బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి..
ప్రతి ఏటా సర్కారు ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది తెలంగాణ సర్కార్ తరపున ఆధ్వర్యంలో బోనాల సంబరాలు ప్రారంభమ య్యాయి. ముందుగా జగదాంబి అమ్మవారికి ఆదివారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలుగు పంచాం గం ప్రకారం, జ్యేష్ఠ మాసం అమావాస్య తర్వాత వచ్చే ఆషాఢ మాసంలో (ashada masam) తొలి గురువారం లేదా తొలి ఆదివారం రోజున గోల్కొండ లోని జగదాంబిక దేవాలయంలో బంగారు బోనంతో సంబురాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది జూలై 5న అమావాస్య శుక్రవారం రాగా జూలై 6 నుంచి ఆషాఢ మా సం ప్రారంభం కానుంది. ఆ మరు సటి రోజు అంటే జూలై 7 ఆదివారం నుంచి భాగ్యనగరంలో బోనాల సం బరాలు ప్రారంభమయ్యాయి.
తెలం గాణ సంప్రదాయానికి చిహ్నమైన బోనాన్ని మహిళలే తయారు చేస్తారు. బోనాల జాతర సందర్భం గా గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ, ము త్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ లకు పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లిస్తారు. తమ కుటుంబాన్ని సుఖశాంతులతో కాపాడాలని, తమకు ఏ ఆపద రాకుండా చూడాలని కోరుకుంటారు. ఈ బోనాలు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రాలోని రాయలసీమ, కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లోనూ జరుపుకుంటారుఅన్నం, పాలు, పెరుగుతో తయారు చేసిన బోనాన్ని మట్టి కుండలో లేదా రాగి కుండలో వండి గ్రామ దేవతలకు సమర్పిస్తారు. అనంతరం బోనం కుండలకు వేపాకులు, పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. కుండపైన ఓ దీపాన్ని కూడా పెడతారు. వీటిని మహిళలు నెత్తిన పెట్టుకుని.. మేళ తాళాలతో, డప్పు చప్పుళ్ల మధ్య ఆలయాలకు తీసుకెళ్లి.. బోనం కుండలను నైవేద్యంగా సమర్పిస్తారు. గ్రామాల్లో దీన్ని ఊర పండుగ అని కూడా అంటారు.ఈ బోనాల పండగను వెయ్యి సంవత్సరాల క్రితం నుంచే జరుపుకుంటున్నారు.
కాకతీయ రాజులలో (Kakatiya kings)ఒకరైన ప్రతాప రుద్రుడు గోల్కోండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పెద్దలు చెబుతారు. ఆ తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు సైతం ఇక్కడ పూజలు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చారు. హైదరాబాదులోని జగదాంబిక అమ్మవారి ఆలయం అతి పురాతనమైందిగా ప్రసిద్ధి గాంచింది. అందుకే ఇక్కడే తొలి బోనాన్ని ప్రారంభిస్తారు. రెండో బోనం బల్కంపేట (balkampet)రేణుక ఎల్లమ్మ గుడిలో, మూడో బోనం సికింద్రాబాదులోని (Secunderabad) ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఎత్తుతరు.సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఓ చరిత్ర ఉంది. బ్రిటీష్ పాలన సమయంలో ఈ ప్రాంతానికి చెందిన సురటి అప్పయ్య అనే వ్యక్తి ఆంగ్లేయుల రాజ్యంలో చేరిన తర్వాత 1813వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి బదిలీ అయ్యాడు. ఆ సమయంలో భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేల మంది చనిపోయారు.
ఆ విషయం తెలుసుకున్న ఆయన సహోద్యోగులతో కలిసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్లి తమ ప్రాంత ప్రజలను రక్షించమని కోరుకున్నాడట. అక్కడ ఆ వ్యాధి తగ్గితే.. ఆ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారికి ఆలయం కట్టిస్తానని మొక్కుకున్నారు. ఆ క్షణం నుంచి ఆ వ్యాధి తగ్గిపోయిందట. ఆ తర్వాత 1815లో తను నగరానికి తిరిగొచ్చి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి, ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి పూర్తి చేయించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది.బోనాల జాతరలో (bonala festival) చివరి రోజు ఓ మహిళ వచ్చి మట్టికుండ మీద నిలబడి భవిష్యవాణి చెబుతుంది. దీన్నే రంగం అంటారు. చివర్లో అంటే ఆగస్టు 4వ తేదీన అమ్మవారి విగ్రహాన్ని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకెళ్లి మూసీ నదిలో నిమజ్జనం చేస్తారు. దీంతో బోనాల సంబురాలు ముగుస్తాయి.