–పటాన్ చెరు నియోజకవర్గంలో అభివృద్ది పనులకు నిధుల కోసం విజ్ఞప్తి
Goodem Mahipal Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: పటాన్ చెరు నియోజకవర్గంలో రోడ్లను విస్తరించడంతో పాటు, రిపేర్లకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Goodem Mahipal Reddy) రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని (Komati Reddy Venkat Reddy) కోరారు. ఆదివారం ఆయన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బంజారహిల్స్ లోని నివాసంలో కలిశారు. పటాన్ చెరు నియోజక వర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు రోడ్ల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలు ఉండటంతో పాటు ట్రాఫిక్ సమస్య (Traffic problem) ఎక్కువగా ఉండ టంతో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నా యని, దీంతో వివిధ కాలనీల ప్రజ లు, ఈ ప్రాంతంలో ఉన్న ఇంజనీరిం గ్ చదివే విద్యార్ధులు నిత్యం ప్రమా దాలబారిన పడుతున్నారని ఎమ్మె ల్యే మహిపాల్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఇందుకు గాను పటాన్ చెరు నుంచి శంకర్ పల్లి (Shankar Palli from Patan Cheru)వరకు ఉన్న డబుల్ లైన్ రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరణకు రూ. 70 కోట్లు, కిష్టారెడ్డిపేట నుంచి దౌల్తా బాద్ వయా రామేశ్వరబండ రోడ్డు ను సింగిల్ లైన్ నుంచి డబుల్ లైన్లు గా విస్తరించేందుకు రూ. 5 కోట్లు, పటాన్ చెరు నుంచి మల్కాపూర్ రోడ్డు రిపేర్లకు రూ. 5.25 కోట్లు, బీహెచ్ఈఎల్ మొయిన్ గేటు నుం చి ఎన్.హెచ్-9 వయా వెల్మలా రో డ్డు రిపేర్లకు రూ. 2.1 కోట్లు, గుమ్మ డిదల నుంచి నూతనకల్ వయా కనుకుంట రోడ్డు విస్తరణకు రూ. 6.82 కోట్లు, శివనగర్ నుంచి కంజెర్ల రోడ్డు విస్తరణకు రూ. 2 కోట్లు మం జూరీ చేయాలని ఆయన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని (Komati Reddy Venkat Reddy) కోరారు.
సంగారెడ్డి ప్రాంతంలోని పలు రహ దారులు ఓఆర్ఆర్ ను (orr) కలుస్తు న్నాయని, విపరీతమైన ట్రాఫిక్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చా రు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే అభ్యర్ధన పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) ఎమ్మెల్యే ప్రతిపాదనల కు తక్షణం అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశిం చారు. తెలంగాణ ప్రభుత్వం రోడ్ల మరమ్మత్తులు, విస్తరణ విషయం లో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతుందని మంత్రి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.