graduate mlc by elections:ప్రశాంతంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ముగింపు
ల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగి సింది.
నల్లగొండ స్ట్రాంగ్ రూంకు బ్యాలెట్ బాక్సులు
ఓటర్లుపట్టభద్రులకూ డబ్బులతో పార్టీల ప్రలోభం
మూడు ప్రధాన పార్టీలూ పంచిన ట్లు విస్త్రుత ప్రచారం
నార్కట్‌పల్లిలో స్వతంత్ర అభ్యర్థి అశోక్ గౌడ్ పై దాడి
ప్రజా దీవెన, హైదరాబాద్: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ(MLC) ఉప ఎన్నిక పోలింగ్(Polling) సోమవారం ప్రశాంతంగా ముగి సింది. ఉదయం 8 నుంచి సాయం త్రం 4 గంటల వరకు కొనసాగిన పోలింగ్‌లో మూడు జిల్లాల పరిధి లోని ఓటర్లలో 73 శాతం మంది ఓటు(Vote)హక్కు వినియోగించుకున్నట్లు సమాచారం. సాయంత్రం 4 గంట ల్లోపు క్యూలైన్లలో నిల్చున్న వారికి సమయం ముగిసినా అవకాశం కల్పించడంతో 30కిపైగా పోలింగ్ స్టేషన్లలో రాత్రి 9గంటల వరకు పోలింగ్ కొనసాగింది.
కాగా, పోలిం గ్ ముగిసే సమయానికి అత్యధి కంగా ములుగు జిల్లాలో 74.54 శాతం, అత్యల్పంగా ఖమ్మం జిల్లా లో 65.54 శాతం నమోదైందని ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి, నల్లగొం డ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన(Dasari Harichandana)ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపడతామని పేర్కొ న్నారు. సోమవారం రాత్రి పోలింగ్ మెటీరియల్‌ను భారీ బందోబస్తు మధ్య నల్లగొండలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూంకు తరలించారు.
Graduate mlc by elections polling completed