–30 నిమిషాల ముందుగానే పరీక్ష ప్రారంభం
–మధ్యాహ్నం 2 గంటల నుంచే ఆరంభం
–అక్టోబరు 21 నుంచి 27 వరకు పరీక్షలు
–షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు
GROUP -1:ప్రజా దీవెన, హైదరాబాద్: గ్రూపు–1 మెయిన్ పరీక్షలను (Group-1 Main Exams) షెడ్యూల్ సమ యం కంటే 30 నిమిషాల ముందు గానే ప్రారంభించాలని అధికారులు (Officers) నిర్ణయించారు. ఈ మేరకు తెలం గాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ అధికారులు శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. దాని ప్రకారం మెయిన్ పరీక్షలను అక్టోబరు 21 నుంచి 27వ తేదీ వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నా రు. గతంలో జారీ చేసిన వెబ్‌నోట్ లో ఈ పరీక్షలను మధ్యాహ్నం 2.3 0 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తామని అని ప్రకటిం చగా తాజాగా స్వల్ప మార్పు చేశా రు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థు లకు పర్సలైజ్డ్ ఆన్సర్ బుక్‌లెట్‌ను అందించాలని అధికారులు నిర్ణ యించారు.
అందులో అభ్యర్థి ఫోటో తో పాటు, ఇతర వివరాలు ముద్రించి ఉంటాయి. పరీక్షలకు (exams) సన్న ద్ధమయ్యేందుకు వీలుగా అభ్యర్థులకు నమూనా ఆన్సర్ బుక్‌లెట్ ఇవ్వనున్నారు. ఈనెల 17 నుంచి ఈ బుక్‌లెట్‌లు పబ్లిక్ సర్వీ స్ (Booklets Public Service s) కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబా టులోకి తెస్తారు. అభ్యర్థులు వాటి ని డౌన్‌లోడ్ చేసుకొని పరీక్ష విధా నాన్ని ప్రాక్టీస్ చేసుకోవడంతో పాటు నిబంధనలను తెలుసుకోవచ్చు. వీటితో పాటు హాల్‌టికెట్లపైన (Hall tickets) ఉన్న నిబంధనలను పరిశీలించుకో వా లని, వాటిని విరుద్ధంగా వ్యవహ రిస్తే బాధ్యత వహించాల్సి ఉంటుం దని హెచ్చరించారు. గ్రూప్–1 మెయిన్ పరీక్షలను (Group-1 Main Exams) హైదరా బాద్(హెచ్‌ఎండీఏ) పరిధిలోనే నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.రాష్ట్రంలో 563 గ్రూప్–1 పోస్టుల భర్తీలో భాగంగా ఇప్పటికే ప్రిలిమనరీ పరీక్షలు పూర్తి చేసి, ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అందులో ప్రతిభకన బరి చిన వారిని ఒక్కో పోస్టుకు 50 అభ్యర్థుల చొప్పున మెయిన్ పరీ క్షకు ఎంపిక చేశారు. ఇంటర్వ్యూలు లేకుండా పరీక్షల్లో చూపే ప్రతిభ ఆధారంగానే ఈ గ్రూప్–1 పోస్టు లను భర్తీ చేయనున్నారు.
గ్రూపు–1 మెయిన్ పరీక్షల షెడ్యూల్ వివరాలు
జనరల్ ఇంగ్లీషు (క్వాలిఫై టెస్ట్) 21 న, పేపర్–1 జనరల్ ఎస్సే 22న, పేపర్–2 చరిత్ర, కల్చర్ అండ్ జాగ్రఫీ 23న, పేపర్–3 ఇండియన్ సొసైటీరాజ్యాంగం–పాలన 24న, పేపర్–4 ఎకానమీ అండ్ డెవల ప్‌మెంట్ 25న, పేపర్–5 సైన్స్ అం డ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ ప్రిటేషన్ 26న, పేపర్–6 తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ 27న జరుపనున్నట్లు షెడ్యూల్ (Schedule) లో వెల్లడించారు.