Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Biometric:రేపే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష

తెలం గాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిష న్‌(టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఆదివారం నిర్వహించనుంది.

రాష్ట్రలో 897 పరీక్ష కేంద్రాల్లో పరీ క్ష రాయనున్న 4.03 లక్షల మంది అభ్యర్థులు
ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష

ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలం గాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిష న్‌(టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష(Group-1 Prelims Exam)ఆదివారం నిర్వహించనుంది. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగ నున్న ఈ పరీక్ష కోసం అన్ని ఏర్పా ట్ల‌ను పూర్తి చేసింది. అభ్యర్థులు ఉద యం 10 గంటలలోపు ఆయా పరీక్షా కేంద్రాలకు(Examination centers)చేరుకోవాలని, పది తర్వాత ఒక్క నిమిషం ఆల స్యంగా వచ్చినా అనుమతించబో మని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 897 పరీక్ష కేంద్రాల్లో 4.03 లక్షలమంది అభ్య ర్థులు పరీక్ష రాయనున్నారని, పరీక్ష రాసే అభ్యర్థులకు కీలక మార్గదర్శ కాలను జారీ చేశారు.

ఇదిలా ఉంటే అధికారులు అభ్యర్థులకు పలు సూచనలు చేస్తున్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు బూట్లు ధరించ కుడదు, చప్పల్స్ మాత్రమే వేసు కోవాలి. బయోమెట్రిక్(Biometric)వేలిముద్ర వివరాల రికార్డింగ్‌ ఉన్న క్రమంలో అభ్యర్థులు తమ వేళ్లపై మెహెందీ లేదా ఏదైనా ఇతర ప్రింటెడ్ రంగు లు ఉంచుకోరాదు.కాలిక్యులేటర్‌లు పేజర్‌లు, సెల్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, పెన్ డ్రైవ్‌లు, బ్లూటూత్ పరిక రాలు, గడియారాలు తీసుకురావ డం నిషేధం లాగ్ బుక్‌లు, లాగ్ టేబుల్‌లు, వాలెట్‌లు, హ్యాండ్‌ బ్యాగ్‌లు, పౌచ్‌లు, రైటింగ్ ప్యాడ్‌ లు, నోట్స్, చార్ట్‌లు, లూజ్ షీట్‌లు, ఆభరణాలు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు(Electronic gadgets)కూడా తీసుకురావద్దు

ఐడీకార్డు, హాల్ టిక్కెట్(Hall ticket) తప్పని సరిగా తెచ్చుకోవాలని, హాల్ టికెట్ ఫోటో సరిగా లేకుంటే మరొక ఫోటో తెచ్చుకోవాలని అధికారులు సూ చించారు.ఈ నిబంధనలు ఉల్లం ఘిస్తే చట్టపరమైన చర్యలు తీసు కుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఇది ఇలా ఉంటే గ్రూప్ 1 సర్వీస్‌లోని 563 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. దీనిలో డిప్యూటీ కలెక్టర్(Deputy Collector), జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, జిల్లా పంచాయితీ రాజ్ ఆఫీసర్, అసి స్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ వంటి పోస్టులున్నాయి.

Group one prelims exam tomorrow