–పరిహారానికి ఆరు నెలల్లో దరఖాస్తు చేసుకోవాలి
–కుటుంబానికి రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
–గతేడాది డిసెంబరు 7 తర్వాత మృతి చెందినవారికే
— రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Gulf Countries: ప్రజా దీవెన, హైదరాబాద్: గల్ఫ్ దేశాల్లో Gulf Countries) పని చేసేందుకు వెళ్లి, వివిధ కారణాలతో తెలంగాణకు చెందిన కార్మికులు చనిపోతే ఆ కుటుంబా లకు రూ.5 లక్షల చొప్పున పరిహా రం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. మృతుల కుటుంబాల్లో ఎక్స్‌గ్రేషియా (Exgratia)పొందే అర్హత గల సభ్యుల వివరాలను కూడా వెల్లడించింది. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగా ణ రాష్ట్రానికి చెందిన కార్మికులకే ఈ ఎక్స్‌గ్రేషియా వర్తిస్తుంది. గత సంవత్సరం డిసెంబరు 7 తర్వాత మృతి చెందినవారికి దీన్ని అమలు చేస్తారు. మృతిచెందిన ఆరు నెలల లోపు బాధిత కుటుంబసభ్యులు జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకో వాల్సి ఉంటుంది. గల్ఫ్ దేశాల్లో రాష్ట్రానికి చెందిన కార్మికులు మృతిచెందితే 5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామంటూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిం చింది. ఈ మేరకు మార్గదర్శకాల ను సోమవారం సీఎస్ శాంతికు మారి జారీచేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏడు గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఒమన్, ఖతార్, సౌది అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమి రేట్స్‌లో (Bahrain, Kuwait, Iraq, Oman, Qatar, Saudi Arabia, United Arab Emirates) మృతి చెందే తెలంగాణ కార్మికులకు వర్తింపు ఉంటుంది.
మృతుల భార్య లేదా భర్త, పిల్లలు, తల్లిదండ్రులను (Husband, children, parents)కుటుంబసభ్యు లుగా పరిగణిస్తారు. వీరికి ప్రాధా న్య క్రమంలో ఎక్స్‌గ్రేషియా అంద జేస్తారు.దరఖాస్తుతో పాటు సదరు కార్మికుడి మరణ ధ్రు వీకరణ ప త్రం, రద్దు చేసిన పాస్‌పోర్టు, పై ఏడింటిలోని ఏదైనా ఒక దేశంలో పని చేస్తున్నట్లు వీసా ధ్రువీకరణ పత్రం, ఎక్స్‌గ్రేషియా పొందేవారి బ్యాం కు అకౌంటు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
పైన పేర్కొన్న అన్ని ధ్రువీకరణ పత్రాలతో (Certification documents) అర్హత గల కుటుంబ సభ్యుడు తమ జిల్లా కలెక్టరుకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ దర ఖాస్తు, ధ్రువీకరణ పత్రాలను కలె క్టర్ పరిశీలించాల్సి ఉంటుంది. దరఖాస్తు పరిశీలన అనంతరం ఎక్స్‌గ్రేషియాను మంజూరు చేస్తు న్నట్లు జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్స్ జారీ చేయాలి. వెంటనే సంబంధిత కుటుంబ సభ్యుడి బ్యాంకు అకౌంట్ లో రూ.5 లక్షల ఎక్స్‌గేషియా సొ మ్మును జమ చేయాలి. గల్ఫ్ కార్మి కుడు మరణించిన నాటి నుంచి లేదా మృతదేహాన్ని కుటుంబ స భ్యులు తీసుకున్న నాటి నుంచి ఆరు నెలల్లోగా సంబంధిత జిల్లా కలెక్టర్‌కు ఎక్స్‌గ్రేషియా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు అందిన తర్వాత సాధ్యమైనంత తక్కువ సమయంలోనే ఎక్స్‌గ్రే షియాను మంజూరు చేసేలా కలెక్టర్లు (Collectors)జాగ్రత్త వహించాలి.