Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Guru Nanak College: ఇబ్రహీంపట్నంలో కలకలం, గురునానక్ కాలేజీలో విద్యార్థుల అదృశ్యం

ప్రజా దీవెన, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని గురునానక్ కాలేజీలో గడచిన పది రోజులుగా ముగ్గురు విద్యార్థులు దృశ్యం కావడం కలకాలం సృష్టించింది. అసలు వీళ్లంతా అదృశ్యం కావడం మిస్టరీగానే మిగిలింది. అదృశ్యమైన విద్యా ర్థులు ఎక్కడికి వెళ్లారు, స్వతహాగా నే పారిపో యారా, లేదంటే కిడ్నాప్‌కు గుర య్యారా అనే కోణంలో అనేక అను మానాలు వ్యక్తమవుతున్నాయి. బీటెక్ ఫస్టియర్ చదువుతున్న ము గ్గురు మిస్సింగ్ అవ్వడం అటు తల్లి దండ్రులలో, ఇటు కాలేజీ యాజ మాన్యంలో తీవ్ర ఆందోళన కలిగి స్తోంది.

విద్యార్థులు అదృశ్యమైన ట్లు కళాశాల యాజమాన్యం, తల్లి దండ్రులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో వేర్వేరుగా ఫిర్యాదు చే శారు. డిసెంబర్ 14న 17ఏళ్ల కొత్తగడి విష్ణు మిస్సైనట్లు తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 18న 17 ఏళ్ల కొంగరి శివా ని అదృశ్యమైనట్లు కాలేజీ జనరల్ మేనేజర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 19 ఏళ్ల ఉప్పల పావని ఈ నెల 20వ తేదీ నుంచి కనిపించడం లేదని తల్లి ఉప్పల కృష్ణవేణి పిర్యా దు చేశారు. తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యం పిర్యాదు మేరకు పోలీసూలు కేసు నమోదు చేసుకొ ని వారి కోసం గాలిస్తున్నారు.10 రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యా ర్థులు అదృశ్యమవ్వడంతో ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆం దోళనకు గురౌతున్నారు. కాలేజ్‌కి ఫోన్‌ చేసి వివరాలు ఆరా తీస్తు న్నారు.