Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Harish Rao: బుచ్చమ్మది ఆత్మహత్య కానే కాదు..రేవంత్ ప్రభుత్వ హత్య

–హైడ్రా తో ఇప్పటికే మూడు ఆత్మ హత్యలు జరిగాయి
–కూల్చివేతలు కాదు నిలబెట్టడం నేర్చుకో రేవంత్ రెడ్డి
–వెంటనే ఆఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి
–ఎవరికోసం ఈ మూసీ సుందరీ కరణ, ఎవరికి మేలు చేసేందుకు ఈ కూల్చివేతలు
— రేవంత్ ప్రభుత్వం పై మాజీ మంత్రి హరీష్ ఫైర్

Harish Rao:ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాదులో జరిగిన బుచ్చమ్మ ది ఆత్మహత్య కానే కాదని, రేవంత్ ప్రభుత్వ హత్య అని మాజీమంత్రి హరీష్ రావు (Harish Rao)తీవ్రస్థాయిలో మండి పడ్డారు. హైడ్రా తో హైదరాబాదులో ఇప్పటికే మూడు ఆత్మ హత్యలు జరిగాయని, కూల్చివేతలు కాదు నిలబెట్టడం నేర్చుకో రేవంత్ రెడ్డి (Revanth Reddy) అంటూ హితవు పలికారు. హైడ్రా చర్యలపై వెంటనే ఆఖిలపక్ష సమా వేశం ఏర్పాటు చేయాలని డిమాం డ్ చేశారు.ఎవరికోసం ఈ మూసీ సుందరీ కరణ, ఎవరికి మేలు చేసేం దుకు ఈ కూల్చివేతలoటూ ప్రశ్నల వర్షం కురిపించారు. హైడ్రా (Hydra)వేధిం పులతో ఆత్మహత్య చేసుకు న్న బుచ్చమ్మ మృతదేహాన్ని చూసేం దుకు శనివారం గాంధీ మార్చురీకి వచ్చిన ఆయన సబితా ఇంద్రా రెడ్డి, కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణా రావు లతో కలిసి మీడియాతో మాట్లాడారు. కూకట్ పల్లి నియో జకవర్గం నల్లచెరువు బఫర్ జోన్ లో ఉన్నటువంటి బుచ్చమ్మ గారు హైడ్రా అధికారుల వేధింపులు భరిం చలేక, ఇల్లు ఎప్పుడు కూలగోడతా రో తెలువక ఆందోళనతో ఆత్మహ త్య చేసుకోవడం జరిగిందన్నారు.

హైడ్రా పేరిట ఇప్పటికే మూడు ఆత్మహత్యలు జరిగాయని, రేవం త్ రెడ్డిని (Revanth Reddy) నేను అడుగుతున్నా నని,ఇంకా ఎంతమందిని చంప దలుచుకున్నారని ఫైర్ అయ్యారు. బుచ్చమ్మ ది ఆత్మహత్య (suicide)కాదు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం చేసిన హత్య అని, ఇది కేవలం రేవంత్ రెడ్డి చర్యల వల్ల జరిగిన హత్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో, గాంధీ హాస్పి టల్ లో చిన్న చిన్న మం దులు లేక పారాసిట్ మల్ లాంటి గోలీలు కూడా ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుక్కునే పరిస్థితి ఏర్ప డిందని విచారం వ్యక్తం చేశారు. గవర్నమెంట్ హాస్టళ్లలో, స్కూళ్లలో పురుగుల అన్నం పెట్టి వేధిస్తున్నా రని ఆందోళన వ్యక్తం చేశారు. హైద రాబాద్ ని నిలబెట్టే పని చెయ్యి కాని కూల్చివేతలు కాదు నిలబెట్ట డం నేర్చుకో అంటూ హితవు పలి కారు. హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోని ఎమ్మెల్యేలతో సమా వేశం ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రకటిస్తామని, గత కాంగ్రెస్, తెలు గుదేశం ప్రభుత్వ ఆదాయంలో ని ర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చారని, 30 ఏళ్ల నుండి నివాసాలు ఏర్పర చుకున్న వారిని కూల్చే అధికారం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.

2013 భూ సేకరణ చట్ట ప్రకారం పేదలను నిర్వాసితు లను చేస్తే ఇంటికి నష్టపరిహారం ఇ వ్వాలి కొత్త ఇల్లు నిర్మించి ఇవ్వాల ని, జీవన భృతి కింద ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్ర భుత్వం (Congress Govt) తెచ్చిన భూసేకరణ చట్టం లో స్పష్టంగా ఉందన్నారు. ఉపాధి పోయి ఇల్లుపోయి ప్రజలు రోడ్డు మీదకు వస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్ట పరిహారం ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వం దగ్గర ఎలాంటి సమాచారం లేదని విమర్శించారు. నష్టపరిహారం, ఉ పాధి కల్పించడంచేసిన తర్వాత వారిని ఒప్పించిన తర్వాతనే నిర్మా ణాలను కూలగొట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా ప్రజలకు సహాయం చేస్తావా, లేక పేదలకు కన్నీళ్లు పెట్టిస్తావా అని ప్రశ్నించా రు.ఇప్పటికైనా పిచ్చి పనులు మా ర్చుకో రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండి పడ్డారు. వెంటనే ఆఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని , అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల నిర్ణయాలతో (Decisions of the parties) ముందుకు వెళ్లాలని సూచించారు.

బాధితులు ఆందోళన చెందవద్దు మీకు అండ గా బిఆర్ఎస్ పార్టీ (BRS party) ఉందని హామీ ఇచ్చారు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఉన్నదాం ట్లో అందరికి మంచి చేయాలని పే దల కన్నీళ్లు మనకు వద్దని తెలి పారు. ఎవరికోసం ఈ మూసీ సుందరీ కరణ, ఎవరికి మేలు చేసేందుకు ఈ కూల్చివేతలు అంటూ చమత్కరించారు. హైడ్రా మీద పోలీస్ కేసు నమోదు చేయా లని, రంగనాథ్ పేదవాళ్ల ఇళ్లను రాత్రికి రాత్రి కూల్చివేస్తున్నారని, రేవంత్ రెడ్డి (Revanth Reddy) సోదరునికి నెల రోజు ల ముందు పర్మిషన్ తెచ్చుకునే అవకాశం కల్పించారని ఆరో పిం చారు. పేదవారి ఇండ్లను ఎందుకు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తు న్నారని, పేదవారికి ఒక న్యాయం రేవంత్ రెడ్డి సోదరులకు ఒక న్యా యమా అని ప్రశ్నించారు. పేదలు కోర్టుకి (court)వెళ్లలేరు అనే ధైర్యంతోనే కదా వారి ఇళ్లను కూల్చి వేస్తు న్నారని అడిగారు. రేవంత్ రెడ్డి సోదరులు లాగానే అందరికి నోటీ సులు ఇవ్వాలని, రేవంత్ రెడ్డి ఇలాంటి చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు.