Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Harish Rao: రైతులు నిరసన తెలిపితే తప్పా..!

–పలు జిల్లాల‌లో అరెస్ట్ లు, కేసులు న‌మోదు
–మండిప‌డ్డ బిఆర్ఎస్ నేత హ‌రీశ్ రావు
–న్యాయం అడిగితే గొంతు నొక్కు తారా
–ఇదేనా మీరు చెబుతున్న ప్ర‌జాపా ల‌న‌

Harish Rao: ప్రజా దీవెన, హైదరాబాద్‌: రుణ మాఫీ కాలేదన్న రైతులను అరెస్టు లు చేస్తారా అని ఎమ్మెల్యే హరీశ్‌ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామిక విధానాలను కాంగ్రె స్ ప్రభుత్వం అనుసరించడం సిగ్గు చేటని విమర్శించారు. రుణమాఫీ కాలేదని అదిలాబాద్ జిల్లా తలమ డుగులో నిరసన తెలియచేస్తున్న రైతులను అరెస్టులు చేయడం హేయమైన చర్య అన్నారు. పోలీసు యాక్ట్ (Police Act)పేరు చెప్పి, జిల్లాలో నిరసన లు, ఆందోళనలు చేయొద్దని పోలీ సులు హుకుం జారీ చేయడం హ క్కులను కాలరాయడమేనని చెప్పా రు.రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతం గా నిరసన తెలియచేస్తున్న రైతుల ను ముందస్తుగా అదుపులోకి తీసు కుంటున్నారని, అరెస్టులు చేస్తు న్నారని వెల్లడించారు.

ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని బీఆర్ఎస్ పార్టీ (BRS party)పక్షాన తీవ్రంగా ఖండిస్తు న్నా మన్నారు. రైతులు రుణమాఫీ కాక పోవడంతో కలెక్టరేట్లు, వ్యవసాయ కార్యాలయం, బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగి వేసారి పోతున్నారని చెప్పారు. ఏం చేయాలో తెలియక చివరకు రోడ్డెక్కి ఆందోళన చేస్తు న్నారని తెలిపారు. అన్ని జిల్లాల్లో నూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నదని వెల్లడించారు. ప్రభుత్వం రైతుల రుణమాఫీ సమస్యకు పరిష్కారం చూపకుండా, పోలీసులను పుర మాయించి గొంతెత్తిన వారిని బెది రించడం, అణగదొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గమని విమర్శిం చారు.ఒకవైపు రైతుబంధు రాక, మరోవైపు రుణమాఫీ కాక అన్న దాత ఆవేదనలో ఉన్నాడని చెప్పా రు. వ్యవసాయ పనులు చేసు కోవాలా లేక రుణమాఫీ కోసం ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాలా అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారని వెల్లడించారు. ఏకకాలంలో ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆచరణలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారని ఎద్దేవాచేశారు. నమ్మి ఓటేసి నందుకు రైతన్నను నట్టేట ముం చారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిట శాపంగా మారింద న్నారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడ్డ ట్లు చరిత్రలో లేదన్న విషయాన్ని కాంగ్రెస్ పాలకులు (Congress rulers)మరిచిపోయి నట్లున్నారని చెప్పారు. అదిలాబాద్ సహా ఇతర జిల్లాల్లో రైతన్నలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహ రించుకోవాలని, లేదంటే అరెస్టు చేసిన రైతన్నలకు అండగా బీఆర్ ఎస్ పార్టీ కార్యచరణ ప్రకటిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.