Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Harish Rao: విషజ్వరాలపై కాంగ్రెస్ ప్రభుత్వo నిర్లక్ష్యం

–జ్వరాలతో బలవుతున్నా ప్రజల ను పట్టించుకోని ప్రభుత్వం
— మాజీ మంత్రి హరీష్ రావు

Harish Rao: ప్రజా దీవెన, హైదరాబాద్: డెంగీ, మలేరియా, గన్యా (Dengue, Malaria, Ganya) వంటి విషజ్వరాలతో రాష్ట్రం వణుకు తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేకపోవడం శోచనీయ మని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మె ల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. డెంగీ జ్వరాల బారిన పడి 24 గంటల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రభు త్వ నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రజలకు శాపం గా మారుతోoదన్నారు. బుదవారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందే ప్రభుత్వాన్ని హెచ్చరించాం. నిధులు విడుదల చేసి పారిశుద్ద్య నిర్వహణ కొనసాగించాలని, ప్రజా రోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వా లని వానా కాలం ప్రారంభంలోనే కోరాము. కానీ ప్రభుత్వం మా సూచనలను పెడచె విన పెట్టింది. సకాలంలో చర్యలు తీసుకొని ఉంటే విషజ్వరాలు ఇంతగా విజృం బించేవి కావు. ఏటా వానాకాలం ప్రారంభంలోనే పారిశుద్ధ్య చర్యలు (Sanitation measures)తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వా ల మీద ఉంటుంది. కానీ ఈ ప్రభు త్వం మొదటి నుంచి పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ వచ్చింది.

ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Minister, Chief Secretary to Govt) స్థాయి లో ఒక్కనాడు కూడా సమీక్ష నిర్వ హించ లేదు. దోమల నివారణకు గ్రామాలు, పట్టణాల్లో స్పెషల్ డ్రైవ్ లు చేపట్టలేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. మరోవైపు పంచాయతీ లకు నిధులు విడుదల చేయయ పోవడంతో గ్రామాలు మురికికూ పాలుగా మారుతున్నాయి. సొంత జేబుల నుంచి ఖర్చు చేస్తూ వచ్చిన పంచాయతీ కార్యదర్శులు ఇక తమ వల్ల కాదని సామూహికంగా సెలవులు పెడుతున్నారు, విధులకు దూరంగా ఉంటున్నారు.

ప్రభుత్వ సమీక్షలు లేక, నిధులు విడుదల చేయక, పారిశుద్ధ్య నిర్వహణ (No government reviews, no release of funds, sanitation management)జరగకపోవడంతో దోమలు విజృంభించి విష జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో జ్వరాల బారిన పడుతున్నారు. ప్రతి రెండు ఇండ్లలో ఒకరు వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. ఆసుపత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి వచ్చిందం టే రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి ఎలా ఉందో అర్థం చేసుకో వచ్చు. ఇంత జరుగుతున్నా ప్రభు త్వం చర్యలకు ఉపక్రమించడం లేదు. మొద్దు నిద్ర వీడటం లేదు. పరిపాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీ యాలు చేయడం, ప్రతిపక్ష నాయ కుల మీద బురద జల్లడానికే ప్రాధాన్యమిస్తున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి పారిశుద్ధ్య నిర్వహణ, ఆసుపత్రుల సన్నద్దత వంటి ముఖ్యమైన అంశాలపై తక్షణం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి వైరల్ ఫీవర్స్ బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా చూడాలని ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ (demnad)చేస్తున్నా మన్నారు.