Harish Rao: ప్రజా దీవెన, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణ (SC and ST subcategory) అంశంపై సర్వో న్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ను బీఆర్‌ఎస్ పార్టీ పక్షాన స్వాగ తిస్తున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) తెలిపారు. తెలంగాణ శాసనసభలో (Telangana Legislature) ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై ఆయన మాట్లాడుతూ వర్గీకరణపై తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సభా నాయకుడిగా కేసీఆర్ నవంబర్ 29, 2014లో వర్గీకరణ వెంటనే చేయాలని ఆ నాడు కేసీఆర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారన్నారు. కేంద్రానికి ఏకగ్రీవంగా వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేసిన పార్టీ బీఆర్‌ఎస్ అని తీర్మానం చేయడం తో పాటు ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలని తీర్మానం కాపీని స్వ యంగా కేసీఆర్ తీసుకొని వెళ్లి ఆ నాటి ఉప ముఖ్యమంత్రులు, దళిత నాయకులతో కలిసి ప్రధానిని కలిసి అందజేశారని గుర్తు చేశారు. అంతే కాకుండా వర్గీకరణ ప్రాధాన్యతను ప్రధానికి కేసీఆర్ వివరించారని ప్రధాని ఆ రోజు కూడా చాలా స్పష్టంగా ఇది న్యాయమైన డిమాం డ్ (demand) అనీ, దీన్ని తప్పకుండా పరిష్కరి స్తామని ఆ రోజు సానుకూలంగా స్పందించారన్నారు. అయితే, వర్గీకరణ పోరాటం సుదీర్ఘమైందని.. ఎన్నో త్యాగాలు జరిగాయన్నారు. ఎంతో మంది ప్రాణాలు అర్పించిన సంగతి మనకు తెలుసునన్నారు. ఇదే గాంధీ భవన్ దగ్గర పెట్రోల్ పోసుకొని ఆ రోజు కొందరు మా దిగలు ఆత్మాహుతికి పాల్పడితే.. అప్పటి ప్రభుత్వం కనీసం వాళ్లను పట్టించుకున్న పాపానపోలేదని మండిపడ్డారు.
కానీ, ఆ మాదిగలకు కేసీఆర్ (kcr).. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వారందరికీ ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్న పార్టీ బీఆర్‌ఎస్ (brs), నాయకుడు కేసీఆర్ (kcr) అని తెలిపారు. ఆ నాడు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని.. వర్గీకరణ చేయడం లేదని మందకృష్ణ మాదిగ నేతృత్వంలోని గాంధీ భవన్ వద్ద పెద్ద ఎత్తున మాదిగలు ముట్టడికి వచ్చి పోరాటం చేసేందుకు వచ్చిన విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలని హితవు పలికారు. ఆ రోజు అమరులైన కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వం ఆదుకున్నది తప్ప గతంలో ఉన్న కాంగ్రెస్ పట్టించుకోకుండా అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అంటూ ధ్వతజమెత్తారు. ఏదిఏమైనా ఈ సందర్భం చాలా సంతోషమైన సందర్భమన్నారు. దశబ్దాలా కల నెరవేరినటువంటి రోజని.. దాంతోనే ఇవాళ బీఆర్‌ఎస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టు తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. అలాగే, ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కిల్ యూనివర్సిటీకి (Skill University) సంబంధించిన బిల్లుకు బీఆర్‌ఎస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతును తెలుపుతున్నాం. కానీ, నిన్న ఇవాళ సభ జరిగిన తీరు మా హృదయాలను గాయపరిచిందన్నారు. మహిళా శాసనసభ్యులను అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.