— మాజీ మంత్రి పార్టీ సీనియర్ నేత హరీష్ రావు..
Harish Rao: ప్రజా దీవెన, హైదరాబాద్: బంజారాహిల్స్ లోని కేటీఆర్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పార్టీ సీనియర్ నేత హరీష్ రావు.. రేవంత్ రెడ్డి అరెస్టయి జైల్లో పడడానికి ఈ కేసుకి సంబంధం లేదని రేవంత్ రెడ్డి డబ్బుల కట్టలతో కెమెరాల ముందు దొరికి జైలుకు పోయాడు అని అన్నారు.కేటీఆర్ మాత్రం తెలంగాణ కోసం హైదరాబాద్ బ్రాండ్ ఈమేజి కోసం ఫార్ములా ఈ రేస్ తీసుకువచ్చాడు అని రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం కేటీఆర్ అక్రమ కేసుకి పోల్చడం అంటే మోకాలికి బోడి గుండు కి ముడి వేయడమే అని హరీష్ రావు తెలిపారు.
ఎన్ని రకాల కేసులు పెట్టిన మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పైన వెనకకిపోము ,ఎన్ని కేసులు పెట్టినా నువ్వు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసేదాకా నీ వెంట పడతాం అని అన్నారు.అక్రమ కేసులతోనూ అరెస్టులతోనూ మమ్మల్ని బలహీనపరచాలని రేవంత్ రెడ్డి కుట్ర చెల్లదు అని ఎన్ని రకాల కేసులు పెట్టిన రేవంత్ రెడ్డిని వదిలిపెట్టము..ఈరోజు హైకోర్టులో ఇచ్చిన తీర్పు కేసులో అవినీతి జరిగిందని నిర్ధారించలేదు .కేసులో అవినీతి ఉందని శిక్ష వేసిన తీర్పు కాదని
ప్రభుత్వం అవినీతి జరిగింది అని చెప్పినప్పుడు… విచారణ చేసుకోమని కోర్టు చెప్పింది.గతంలో కూడా కేటీఆర్ గారు విచారణకు సిద్ధమని చెప్పాము అని అన్నారు.
ఈ అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలా అనే అంశం పైన మా లీగల్ సెల్ నిర్ణయిస్తుంది.హైకోర్టు తీర్పు కాపీని పూర్తిగా చదివిన తర్వాత మా లీగల్ సెల్ సలహా మేరకు తదుపరి కార్యాచరణ చేపడతాం అని అన్నారు.మొన్న ఏసీబీ దగ్గరికి కూడా విచారణ ఎదుర్కోవడానికి కేటీఆర్ వెళ్లారు.9వ తేదీన కూడా ఇచ్చిన నోటీసు మేరకు విచారణకు వెళ్తారు .మొన్న 45 నిమిషాలు ఆపిన కేటీఆర్ ఓపిగ్గా వేచి చూశారు… కచ్చితంగా విచారణను ఎదుర్కొంటాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడం కోసమే… ఫార్ములా ఈ ని కేటీఆర్ హైదరాబాద్ కి తెచ్చారు అని గుర్తు చేశారు.
ఇదే రేసును తమ రాష్ట్రాలకు నగరాలకు తీసుకురావడానికి అనేక రాష్ట్రాలు పోటీపడ్డాయి అని.ఒక్క రూపాయి కూడా చేతులు మారనప్పుడు అవినీతి ఎట్లా జరుగుతుంది అని. కేటీఆర్ అడుగడుగునా రేవంత్ రెడ్డి తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే ఈ కేసు అటేషన్ డైవర్షన్ కోసమే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు. రైతుబంధు ఎగగొట్టడం వల్ల ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటుంది.అన్ని సర్వే రిపోర్టులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తున్నాయి కాబట్టి అందుకే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన అక్రమ కేసు పెట్టి అటెన్షన్ డైవర్షన్ కోసం రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారు అని ఆరోపించారు. భవిష్యత్తులను ఇలాంటి అటెన్షన్ డైవర్షన్ కోసం కేసులు రేవంత్ రెడ్డి పెడతాడని మాకు తెలుసు ఎన్నో పోరాటాలతోనే త్యాగాలతోని తెలంగాణ తెచ్చుకున్నాము అని హరీష్ రావు తెలిపారు..