Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Harish Rao: మూగ జీవాల అరణ్యరోదన..!

–సిఎం రేవంత్ ప్రభుత్వం లో మూగ జీవాలకూ దిక్కులేదు
–పశుసంవర్ధక శాఖ మీ చేతిలోనే ఉందని గుర్తుంచుకోండి
–ప‌శువుల‌కు రోగాలు సోకితే వైద్య o చేసే దిక్కులేదు
–అత్యవసర మందులూ పశు వైద్య శాలలో కరవయ్యాయి
–సీఎం రేవంత్ కు లేఖలో మాజీ మంత్రి హరీశ్ ఘాటు వ్యాఖ్యలు

Harish Rao: ప్రజా దీవెన, హైదరాబాద్: వ్యవ సాయంలో దన్నుగా నిలుస్తూ, పాడిసంపదతో అదనపు ఆదా యాన్ని సమకూర్చే మూగజీవాల సంరక్షణపై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) నిర్ల క్ష్యాన్ని ప్రదర్శించడం శోచనీయమ ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో (Telangana Bhavan)నేడు మీడియా తో మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ కూడా సీఎం వద్దే ఉన్నప్పటికీ మూగజీవాల మౌనరోదనను మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఆవు లు, గేదెలు, గొర్రెలు, మేకలకు వ్యా ధులు (Diseases of cows, buffaloes, sheep and goats)సోకితే తగిన వైద్యం అందిం చేందుకు ప్రభుత్వ పశువైద్యశాలల్లో మందులు లేని దుస్థితి నెలకొందని అన్నారు. ఎమర్జెన్సీ మందులు సహా పెయిన్ కిల్లర్స్, విటమిన్స్, యాంటీ బయాటిక్స్ వంటి అన్ని రకాల మందుల సరఫరా 9 నెలలు గా నిలిచిపోయిందని రేవంత్ రెడ్డికి గుర్తు చేశారు.పాలిచ్చే జీవులకు పొదుగు వాపు, గాలి కుంటు వ్యా ధులు సోకితే ఒక్కో మూగ జీవిపై పాడి రైతులు రెండు వేల దాకా ఖ ర్చు చేయాల్సి వస్తుందన్నారు. ఇది వారికి అదనపు ఆర్థిక భారమవు తుందని చెప్పారు. మూగజీవాల్లో అంతర పరాన్న జీవులను నివారిం చేందుకు మూడు నెలలకు ఒకసారి నట్టల నివారణ మందులను తప్ప నిసరిగా వేయాల్సి ఉంటుందని చెప్పారు. 9 నెలల నుంచి నట్టల నివారణ మందులు సరఫరా చేయకపోవడంతో కాలేయం, జీర్ణాశయం, చిన్నపేగు (Liver, stomach, small intestine) భాగాల్లో పరాన్న జీవులు చేరి రక్తహీనతకు గురి చేస్తున్నాయని అన్నారు.రోగ నిరోధకశక్తి తగ్గి మూగజీవాలు బలహీనంగామారుతున్నాయన్నారు. వ్యాధుల బారిన పడ్డ జీవులు ఆస్పత్రుల్లో మందుల కొరత కారణం గా సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు వాహన ఉద్యోగులు సకాలంలో వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నారని అన్నారు.

కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన చెందుతున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించకపోవడం మూగజీవుల సంరక్షణపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తుందన్నారు. నిర్లక్ష్యం వీడి తగిన చర్యలు తీసుకోవాలని హరీష్‌రావు ముఖ్యమంత్రి రేవంత్ ను కోరారు.