HDFC: ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కీల క ప్రకటన చేసింది. ఇది కస్టమర్లకు శుభవార్త అని చెప్పొచ్చు. ముఖ్యంగా లోన్లు తీసుకునేవారికి ఇది ఊరట కలిగించే నిర్ణయం. చాన్నాళ్ల తర్వాత మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీనినే రుణ ఆధారిత వడ్డీ రేట్లుగా చెబు తుంటారు. 5 బేసిస్ పాయింట్ల వరకు ఎంసీఎల్ఆర్ తగ్గించింది. వడ్డీ రేట్లను సవరించిన తర్వాత.. ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఎంసీఎల్ఆర్ 9.15 శాతం నుంచి 9.45 శాతంగా ఉంది.
సవరించిన ఈ ఎంసీఎల్ఆర్ రేట్లు 2025, జన వరి 7 నుంచి అమలులోకి వస్తుం దని బ్యాంక్ తన అధికారిక వెబ్‌సై ట్లో వెల్లడించింది.ఎంసీఎల్ఆర్ అం టే రుణ ఆధారిత వడ్డీ రేటు. అంటే లోన్లపై బ్యాంకులు వసూలు చేసే కనీస వడ్డీ రేటు అని చెప్పొచ్చు. ఇంతకంటే తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చేందుకు వీల్లేదు. అన్ని బ్యాం కులకు ఒకేలా విధానం ఉండాలన్న ఉద్దేశంతోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఎంసీఎల్ఆర్‌ను తీసుకొచ్చింది. ఎంసీఎల్ఆర్‌ను బట్టే బ్యాంకులు ఆయారకాల లోన్ల పై వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంటాయి. ఎంసీఎల్ఆర్ తక్కువగా ఉంటే.. లోన్లపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. అదే ఎంసీఎల్ఆర్ పెరిగితే.. లోన్ వడ్డీ రేట్లు పెరుగుతాయని చెప్పొచ్చు.
అంటే ఎంసీఎల్ఆర్ తగ్గితే లోన్లపై ఈఎంఐ తగ్గుతుంది. ఎంసీఎల్ఆర్ పెరిగితే.. లోన్ ఈఎంఐ పెరుగు తుందని చెప్పొచ్చు.ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎంసీఎ ల్ఆర్ తగ్గించిన నేపథ్యంలో ఎం సీఎల్ఆర్‌కు లింక్ అయి ఉన్న హోం లోన్స్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్ వంటి వాటిల్లో ఫ్లోటింగ్ రేట్ లోన్లు తీసుకున్నవా రికి ఈఎంఐ తగ్గుతుందని చెప్పొ చ్చు. ఫిక్స్‌డ్ రేట్‌పై తీసుకున్నవారి పై ప్రభావం చూపించదు.ఇప్పుడు ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్లు తగ్గించగా 9.20 శాతం నుంచి 9.15 శాతానికి దిగొచ్చింది. ఒక నెల ఎంసీఎల్ఆర్ 9.20 శాతం వద్దే స్థిరంగా ఉంది. 3 నెలల ఎం సీఎల్ఆర్ 9.30 శాతం వద్ద య థాతథంగానే ఉంది. 6 నెలలు, ఏడాది టెన్యూర్ ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్లు తగ్గి 9.40 శాతా నికి దిగొచ్చింది.
ఇక రెండేళ్ల ఎంసీ ఎల్ఆర్ కూడా 9.45 శాతం వద్దే ఉంది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్లు తగ్గి 9.50 శాతం నుంచి 9.45 శాతానికి పడిపో యింది. ఎక్కువగా ఏడాది, రెండేళ్ల టెన్యూర్ ఎంసీఎల్ఆర్‌తో బ్యాంక్ లోన్స్ అనుసంధానమై ఉంటాయి. ఇవి మారితే లోన్ వడ్డీ రేట్లు మారు తాయన్నమాట.