Heavy rains: ఎండలు, వానలు ఉక్కిరిబిక్కిరి నుంచి ఉపశమనం
తెలంగా ణ వ్యాప్తంగా వాతావరణ శాఖ ప్రక టించిన మేరకు ఆదివారం జడివాన కురుసింది. అప్పటి వరకు ఎండల మంటలతో తో అల్లాడిన ప్రజలకు కుండపోత వర్షం ఉపశమనం కలి గించింది.
ఉదయం నుంచి మండిన ఎండ లు, సాయంత్రం వర్షంతో ఒకే రోజు భిన్న పరిస్ధితులు
పరస్పర విరుద్ద వాతావరణాలతో తెలంగాణ ప్రజల ఆపసోపాలు
సోమవారం సాయంత్రం తర్వాత ఉరుములు, మెరుపులతో జడివాన
హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
అనుకున్నట్లుగానే రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు
రుతుపవనాల చురుకుదనంతో నేడు కూడా అంతటా వర్షాలు
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ(Telangana) వ్యాప్తంగా వాతావరణ శాఖ ప్రక టించిన మేరకు ఆదివారం జడివాన కురుసింది. అప్పటి వరకు ఎండల మంటలతో తో అల్లాడిన ప్రజలకు కుండపోత వర్షం ఉపశమనం కలి గించింది. రాష్ట్ర రాజధాని హైదరా బాద్ తో సహా పలు జిల్లాలను వర్షం ముంచెత్తింది. కరీంనగర్, సిద్దిపేట, కుమరంభీం ఆసీఫాబాద్, వికారా బాద్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఆదివారం రాత్రి వర్షం దంచికొ ట్టింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి పలు చోట్ల విద్యుత్(Electricity) సరఫరాకు అంతరాయం ఏర్పడిం ది. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల కాలనీలు నీట మునిగాయి. ఉప్పల్, రామాంత పూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమ య్యాయి. రోడ్లపైకి వరద నీరు చేర డంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ఇక కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం(Heavy rain) కురిసింది. సుమారు గంటకు పైగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడం తో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమ య్యాయి.
అప్పటి వరకు మండే ఎండ లు.. అప్పుడే జడివానలు..
గడిచిన రెండు మూడు రోజులుగా రోహిణికార్తే(Rohinikarte)ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలకు ఆదివారం రాత్రికి ఉపశమనంలోకి తీసు కొచ్చింది. ఆదివారం రాత్రి ప్రారంభమైన సాయంత్రానికి ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన చెట్లను కూకటివేళ్లతో పెకిలించి, విద్యుత్తుస్తంభాలను విరగొట్టి, ఇళ్లపై రేకులను గల్లంతు చేసి క్షణాల్లో లోతట్టు కాలనీలను జలమయంచేసి భీతావహ పరి స్థితిని సృష్టించింది. అయితే భిన్న వాతా వరణ పరిస్థితులతో రాష్ట్రం లోని పలు ప్రాంతాల్లో నెలకొన్న మిశ్రమ అనుభూతి కలిగింది. మండుతున్న ఎండల మధ్యే జోరు గా వర్షం పడింది. ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్, వాంకిడి, బెజ్జూరు, సిర్పూర్ (టి), పెంచికలపేట, చింత నమాలెపల్లి, దహెగాం మండలాల్లో భారీ వర్షం పడింది. ఆసిఫాబాద్ మండలంజెండాగూడలో ఓ ఇంటిపై రేకులు ఎగిరిపోయాయి. వాంకిండి మండలంలోని పలుగ్రామాల్లో ఇళ్ల పై రేకులు ఎగిరిపోయాయి. ఊర్లో వాగుపై వేసిన తాత్కాలిక రోడ్డు ప్రవా హానికి కొట్టుకుపోయింది. బెజ్జూరు మండలంలో విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి.
మంచి ర్యాల జిల్లా బెల్లంపల్లి, చెన్నూరు, అన్నారం, కన్నెపల్లిలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. మంచిర్యాల జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం నాగ్వా రం సమీపంలో వాగు ఉధృతికి ఓ కారు కొట్టుకుపోయింది. అదృష్టవ శాత్తు వాహనం లోపల ఉన్న నలు గురిలో వెంటనే ఇద్దరు సురక్షితంగా బయటపడగా కారును కాపాడుకు నే క్రమంలో మరో ఇద్దరు ప్రవాహ తీవ్రతకు కొట్టుకుపోయారు. చెట్టు ను పట్టుకొని ఒడ్డుకు చేరారు. బం ట్వారం మండలంలోని పలు గ్రామా ల్లో ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. బంట్వారం బస్టాండ్ వరద నీటితో నిండిపోయింది. అనంతగిరి ఘాట్ రోడ్డులో(Anantgiri Ghat Road)భారీ వర్షానికి చెట్లు విరిగి పడగా రాకపోకలకు ఇబ్బంది కలి గింది. యాదాద్రి జిల్లా బీఎన్ తిమ్మా పూర్, వీరవెల్లి, ముస్త్యాల పల్లి, చీమలకొండూరు గ్రామాల్లో విద్యు త్తు స్తంభాలు పడిపోయాయి. హనుమకొండ జిల్లాలో హనుమ కొండ, కాజీపేట, వరంగల్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయమ య్యాయి. వర్షం తీవ్రతకు పలుచోట్ల విద్యుత్తు సరఫరాలో తీవ్ర అంతరా యం కలిగింది.
కాగా, సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో సోమవారం 44.2, దొంగ ల ధర్మారంలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైం ది. అయితే సాయంత్రాని కి మెదక్, నల్లగొండ ఉమ్మడిజిల్లాల్లో భారీ వర్షం కురిసింది. రాష్ట్రం వైపు నైరుతి వచ్చేస్తోంది. జూన్ 6–8 మధ్య రాష్ట్రంలోని నైరుతి రుతు పవనాలు ప్రవేశించే అవకాశం ఉం దని హైదరాబాద్ వాతావరణ కేంద్ర సంచాలకులు డాక్టర్ కే. నాగరత్న(Dr. K. Nagaratna) తెలిపారు. జూన్ 11 నాటికి తెలం గాణ వ్యాప్తంగా విస్తరించే అవకాశా లున్నాయని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ఫ్రీమాన్‌సూన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నా యని వివరించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
Heavy rains in telangana