Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Temperature: సుర్రుమన్న శుక్రవారం

రాష్ట్రం లో రోహిణి కార్తె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సూర్య ప్రతాపం తో భగభగ ఎండలు మండిపోతు న్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరిగి పోవడం, వేడి గాలులు వీస్తుండ డంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

రాష్ర్ట వ్యాప్తంగా సూర్య ప్రతాపం తో భగభగలు
ఇరవై ప్రాంతాల్లో 46డిగ్రీలకుపైగాఉష్ణోగ్రతలు
వడదెబ్బకు గురై 11 మంది మృ త్యువాత
నేడు, రేపు రాష్ట్రానికి వర్ష సూచ న, మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం

ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో రోహిణి కార్తె(Rohini Karte)ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సూర్య ప్రతాపం తో భగభగ ఎండలు మండిపోతు న్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరిగి పోవడం, వేడి గాలులు వీస్తుండ డంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో శుక్రవా రం 46 డిగ్రీలకు పైబడి గరిష్ఠ ఉష్ణో గ్రతలు నమోదయ్యాయి. శుక్రవా రం రాష్ట్రంలోనే అత్యధికంగా మంచిర్యాల జిల్లా భీమారం, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా నస్పూర్, భద్రా ద్రి కొత్తగూడెంలో 46.9, నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం, ఖమ్మo జిల్లాలో 46.8 ఉష్ణోగ్రత రికార్డ యింది. పాతమంచిర్యాలలో 46.7, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.6, మంచి ర్యాల జిల్లా హాజీపూర్ లో 46.5, జగిత్యాల జిల్లా నేరెళ్లలో 46.4, సూర్యాపేట జిల్లా కోదాడలో 46. 4డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు(Heavy temperature) నమోదయ్యాయి. అలాగే, నల్లగొం డ జిల్లా దామచర్లలో 46.3, కరీం నగర్ జిల్లా జమ్మికుంటలో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనే అత్యధికంగా మలకపేట ప్రాంతంలో 43.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

వడదెబ్బకు 11 మంది మృత్యువాత… వడదెబ్బకు గురై రాష్ట్రంలో శుక్రవారం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన పల్లకొండ ఐలయ్య(75), ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపే టకు చెందిన దామెర రాంబాబు(Damera Rambabu)(50) అనే ప్రైవేట్ ఎలక్ట్రిషియన్,నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన కర్రి రాజు (40), గుర్రంపోడుకు చెందిన రేపాక ముత్తమ్మ (64), మునుగోడు మండలం ఊకొండికి చెందిన కమ్మాలపల్లి మమత (30), వడదెబ్బకు గురై మరణించారు. ధాన్యం విక్రయించేందుకు ఐదు రోజులుగా ఐకేపీ కేంద్రం వద్దే ఉ ంటున్న సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హర్షీపూర్కు చెందిన మల్లీ కల్పన (24) వడదెబ్బకు గురై మరణించింది. పెద్దపల్లి జిల్లా బసంత్నగర్లోని సిమెంట్ పరిశ్రమలో లారీ డ్రైవర్గా పనిచేస్తున్న మధ్యప్రదేశ్కు చెందిన జాకీర్ హుస్సేన్(Zakir Hussain)(60) కరీంనగర్ జిల్లా చొప్పదండికి సిమెంట్ లోడు తీసుకెళ్లి వడదెబ్బకు ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన కళ్యాణం రామక్క (75). పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్కు చెందిన ఈదునూరి కిషోర్ (34), మంచిర్యాల జిల్లా కాసిపేటకు చెందిన దుర్గం భీమయ్య (55), ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని నాగోబా తండాకు చెందిన ఆత్రం లింబారావు (23) శుక్రవారం మరణించారు.

వాతావరణ శాఖ చల్లని కబురు.. భానుడి భగభగలతో రెండ్రోజులుగా అల్లాడిపోతున్న ప్రజలకు చల్లని కబురు. శనివారం నుంచి ఎండల తీవ్రత కాస్త తగ్గ నుంది. శని, ఆదివారాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల్లోపే నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరు పులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉoదని తెలిపింది. ఆదివారం కొన్ని జిల్లాల్లో ఈదు రుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడ భారీ వర్షాలు(Heavy rains) కురుస్తాయని హెచ్చరిం చింది. ఇక నైరుతి రుతుపవనాలు శనివారం కేరళలోని(Kerala) మిగిలిన ప్రాంతాలు, తమిళనాడు, కర్ణాటక లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించేం దుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

Heavy temperature in Telangana