–రెండు రోజుల పాటు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో సదస్సు
HICC: ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రతి ఒక్కరికీ కృత్రిమ మేధస్సు తో పని అనే ఇతివృత్తంతో గ్లోబల్ ఆర్టి ఫిషి యల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ నిర్వ హించడం కోసం ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. గురు, శుక్ర వారా ల్లో రెండు రోజుల పాటు హైదరా బాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెం టర్ (HICC)లో ఈ సదస్సు జరగ నుంది.గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటె లిజెన్స్ సమ్మిట్ నిర్వహించడం దే శంలో ఇదే మొదటి సారి కావడం విశేషం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ సదస్సును ప్రారంభిoచనున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి AI రంగంలో పేరొందిన ప్రముఖులు, సంస్థల ప్రతినిధులు 2000 మంది ఈ సదస్సు లో పాల్గొంటున్నారు.
ఏఐ రంగంలో అందరి దృష్టి ని ఆక ర్షిస్తున్న ఖాన్ అకాడమీ అధినేత సల్ ఖాన్, IBM నుంచి డానియెలా కాంబ్, XPRIZE ఫౌండేషన్ పీటర్ డయామండిస్ తదితర ప్రముఖు లు ఈ సదస్సు కు హాజర వుతారు. ఏఐ రంగం అభివృద్ధి కి తమ ఆలో చనలను పంచుకుంటారు. భవిష్య త్తు అవకాశాలు, కొత్త ఆవిష్కర ణలపై చర్చలు జరుపుతారు. సామాజిక బాధ్యత గా సమాజం పై AI ప్రభావం, నియంత్రణ, సవాళ్ల ను చర్చిస్తారు.కొత్త సాంకేతికత పరిజ్ఞానం తో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, అభివృద్ది (Startup demos, development)దశలో ఉన్న వినూత్న ప్రాజెక్ట్‌లను ఈ సదస్సు లో ప్రదర్శిస్తారు.రెండు రోజుల ఈవెంట్‌లో ప్రధాన వేదిక తో పాటు నాలుగు అదనపు వేదిక లు ఏర్పాటు చేశారు. అన్ని వేదికలపై AI కి సంబంధించి వేర్వే రు అంశాలపై చర్చలు, ఇష్టాగోష్టి సెషన్స్ నిర్వహించే ఏర్పాట్లు చేశా రు.హై-ప్రొఫైల్ ప్యానెల్ డిస్కషన్స్, ఇంటరాక్టివ్ సెషన్ (Panel discussions, interactive session)లు ఏర్పాటు చేశారు. ఐటీ రంగంలో ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించేలా తెలం గాణ ప్రభుత్వం అత్యంత ప్రతి ష్టాత్మకంగా ఈ సదస్సు నిర్వహి స్తోంది.
హైదరాబాద్ లో నిర్మించ నున్న ఫోర్త్ సిటీ లో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా AI సిటీ ని ఏర్పాటు చేయాలని నిర్ణయిం చింది.రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగా నికి ఇస్తున్న ప్రాధాన్యత ను, అందు కు రాష్ట్రంలో ఉన్న అనుకూల వాతా వరణాన్ని ఈ AI గ్లోబల్ సదస్సు ప్రపంచానికి చాటి చెపు తుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రా న్ని AI హబ్ గా తీర్చి దిద్దేం దుకు ప్రపంచ దిగ్గజ సంస్థల పెట్టు బడులను ఆహ్వానించేందుకు ఇటీవ ల అమెరికా పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (revanth reddy) అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో AI సేవలను అబివృద్ధి అవకాశాల తో భవిష్యత్తు కార్యాచరణ తో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రోడ్ మ్యాప్ ను రూపొందించింది. దాదాపు 25 కార్యక్రమాలను ఇం దులో పొందుపరిచారు. AI గ్లోబల్ సదస్సులో ముఖ్యమంత్రి ఈ రోడ్ మ్యాప్ ను విడుదల చేయనున్నారు.