–ఏపీకి వెళ్లి రిపోర్టు చేయాలని ఆదేశం
–ఆ తర్వాత అవసరాన్ని బట్టి మళ్లీ విచారిస్తామన్న హైకోర్టు
High Court: ప్రజా దీవెన, హైదరాబాద్:సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (Central Administrative Tribunal) (క్యాట్) ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును (High Court)ఆశ్రయించిన ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, రొనాల్డ్ రాస్, వాకాటి కరుణ, వాణీప్రసాద్ల కు న్యాయస్థానం షాకిచ్చింది. అధి కారులు ముందు వారికి కేటాయించిన స్టేట్ లో రిపోర్టు (Report)చేయాలని ఆదే శించింది. ‘మీ వాదనలను వింటాం.. కానీ ఇలాంటి విషయా ల్లో ఇప్పటి పరిస్థితుల్లో మేం జో క్యం చేసుకోలేం మీరు రిపోర్టు చేయకుండా ఆపివేసేలా కోర్టులు ఇప్పుడు ఎలాంటి రిలీఫ్ ఇవ్వడం సాధ్యం కాదు, డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం జాయినింగ్ రిపోర్టు ఇవ్వం డి ఆ తర్వాత అవ సరాన్ని బట్టి మళ్లీ విచారిస్తాం.
మీ వాద నలను మరింత లోతుగా వింటామని జస్టిస్ అభినంద్ కుమార్ (Justice Abhinand Kumar)షావిలి ధర్మా సనం వ్యాఖ్యానించింది. ఆ నలు గురు దాఖలు చేసిన లంచ్ మోష న్ పిటిషన్ పై బుధవారం హైకోర్టు (highcourt) బెంచ్ విచారించింది. ఈ సందర్భం గా డీవోపీటీ తరపు లాయర్ వాది స్తూ ఏ అధికారి ఎక్కడ పని చేయా లనే విజ్ఞత అధికారులకు ఉన్నద ని, ఏ అధికారి ఎక్కడ పని చేయా లనే అధికారం కోర్టులకు లేదని వాదించారు. రిలీవ్ చేసేందుకు 15 రోజుల గడువు ఇవ్వాలని రెండు రాష్ట్రాలు డీవోపీటీని కోరాయని ఐఏఎస్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ వాద నలపై స్పందించిన ధర్మాసనం.. ప్రజాసేవ కోసమే ఐఏఎస్ లు ఉంటారని, వారికి ఎక్కడ అవ కాశం కల్పిస్తే అక్కడకు వెళ్లాలని పేర్కొంది. ‘క్యాట్ కొట్టి వేస్తే కోర్టుకు రావడం సరైంది కాదు.. ఇప్పుడు డిస్మిస్ చేస్తే మళ్లీ అప్పీల్ చేస్తారు.. అవస రమైతే సుప్రీంకోర్టుకు వెళ్తారు, అక్కడ కూడా ఇదే వాదనలు చేస్తారు, ఇదంతా లాంగ్ ప్రాసెస్ గా ఉండిపోయేదే,ఈ వివాదాన్ని తేలుస్తాం.. ముందు మీకు కేటా యించిన రాష్ట్రాల్లో చేరాలి..’ అని సూచించింది. అయితే డీవోపీటీ ఆదేశాల మేరకు ఇవాళే అధికారులు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు (Report in states)చేయాల్సి ఉన్నందున వారు ఏం చేయబోతున్నా రనేది ఆసక్తిగా మారింది.