Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

HIV: హెచ్ఐవి ‘పాజిటివ్ ‘

–ఏడాదికి కేవలం 2 ఇంజెక్షన్ల తో ఎయిడ్స్‌కు చరమగీతం
–దక్షిణాఫ్రికా, ఉగాండాలో ట్రయల్స్‌ నూరు శాతం విజయవంతం
–ఈ ఇంజెక్షన్‌ తీసుకున్న 2,134 మంది సురక్షితం
–లెనాకాపవిర్‌ పేరుతో గిలియడ్‌ సైన్సెస్‌ కంపెనీ పరంగా అభివృద్ధి
–మరిన్ని అధ్యయనాల తర్వాత మార్కెట్‌లో అందుబాటులోకి

ప్రజా దీవెన, హైదరాబాద్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న హెచ్‌ఐవీ (HIV) హ్యూమన్‌ ఇమ్యూనో వైరస్‌ పాజిటివ్ (Positive)గా నిలిచింది. హెచ్ఐవి, ఎయి డ్స్ నుంచి రక్షణ ఇచ్చే ఇంజెక్షన్‌ (Injection) లె నాకాపవిర్‌ అతి త్వరలో అందుబాటులోకి రాబోతోంది. ఏటా రెండు సార్లు ఈ ఇంజె క్షన్‌ (Injection) ఇవ్వడం ద్వా రా ఆ వైరస్‌కు చెక్‌ పెట్టవచ్చు. నిజా నికి హెచ్‌ఐవీని నిరోధించే రెండు రకాల మాత్రలు ప్రస్తుతానికి అందు బాటులో ఉన్నాయి. మొదటిది 20 12లో అమెరికా ఆహార, ఔషధ ని యంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అనుమ తి పొందిన ట్రువాడా మాత్ర, రెండో ది 2016లో అందుబాటులోకి వచ్చి న డెస్కోవీ. ఆ రెండింటితో పోలిస్తే క్లినికల్‌ ట్రయల్స్‌లో ఈ ఇంజెక్షన్‌ నూటికి నూరుశాతం విజయవంతం కావడం గమనార్హం.

ఈ ఔషధం.. హెచ్‌ఐవీ క్యాప్సిడ్‌ (HIV capsid) వైరస్‌ చుట్టూ ఉండే ప్రొటీన్లతో కూడిన రక్షణ పొర)ను ధ్వంసం చేయడం ద్వారా వైరస్‌ తన సంఖ్యను పెంచుకోకుం డా చేస్తుంది. ఆఫ్రికా దేశాల్లో చాలా మంది మహిళలు అత్యాచారాలకు గురై ఎయిడ్స్‌ బారిన పడుతున్న నేపథ్యంలో ఈ ఇంజెక్షన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను సౌతాఫ్రికాలోని 25 ప్రాంతాల్లో, ఉగాండాలోని 3 ప్రాంతా ల్లో నిర్వహించారు. ట్రయల్స్‌లో భాగంగా 5000 మంది మహిళలనుఎంచుకుని వారిని మూడు కేటగి రీలుగా విభజించారు. మొదటి కేటగిరీలోని 2134 మంది మహిళలకు లెనాకాపవిర్‌ ఇంజెక్షన్‌ (Lenacapavir injection)ఇచ్చా రు. రెండో కేటగిరీలోని 1068 మం దికి ట్రువాడా, 2136 మందికి డెస్కోవీ మాత్రలు ఇచ్చారు. వీరిలో ట్రువాడా మాత్ర తీసుకున్నవారిలో 16 మందికి, డెస్కోవీ మాత్ర తీసుకున్నవారిలో 39 మందికి ట్రయల్‌ సమయంలో హెచ్‌ఐవీ సోకింది.

లెనాకాపవిర్‌ ఇంజెక్షన్‌ (Lenacapavir injection) తీసుకున్న 2134 మందిలో ఒక్కరికి కూడా హెచ్‌ఐవీ సోకలేదు. అంటే.. 100 శాతం సక్సెస్‌. ఎయిడ్స్‌ కారక హ్యూమన్‌ ఇమ్యూనో వైరస్‌ నుంచి పూర్తిస్థాయిలో రక్షణ లభిస్తుందని తేలింది. ట్రువాడా, డెస్కోవీ మాత్ర లను అభివృద్ధి చేసిన అమెరికన్‌ ఫార్మా దిగ్గజం గిలియడ్‌ సైన్సెస్‌ సంస్థే ఈ లెనాకాపవిర్‌నూ (Lenacapavir ) అభి వృద్ధి చేసింది. తమ క్లినికల్‌ ట్రయ ల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాల ను సౌతాఫ్రికా, ఉగాండా దేశాల్లోని ఔషధ నియంత్రణ సంస్థలకు, ప్రపం చ ఆరోగ్య సంస్థకు (World Health Organization) అందించను న్నట్లు గిలియడ్‌ సైన్సెస్‌ వెల్ల డిం చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కొత్త ఔషధాన్ని ఆమో దిస్తుందని తాము ఆశిస్తున్నట్లు గిలియడ్‌ సైన్సె స్‌ ప్రకటించింది. దీన్ని ప్రపంచ మార్కెట్లోకి తీసుకు వచ్చే ముందు ఈ ఔషధంపై మరిన్ని అధ్యయనా లు చేయాల్సిన అవసరం ఉందని ఆ సంస్థ అభి ప్రాయపడింది. ఈ ఔషధం అందరికీ అందు బాటులో ఉండేలా తక్కువ ధరకు అందించే ఉద్దేశంతో గిలియడ్‌ సైన్సెస్‌ సంస్థ.. జనరిక్‌ డ్రగ్స్‌ తయారుచేసే కంపె నీలకు దీని కి సంబంధించిన లైసెన్స్‌ లు ఇచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. అంటే ఆయా ఫార్మా కంపె నీలు కూడా ఈ ఔషధాన్ని తయారు చేస్తాయన్నమాట. తద్వా రా ఇది ఎక్కువగా అందు బాటు లోకి వచ్చి ధర తగ్గుతుంది. అలాగే ప్రభుత్వాలు కూడా ఈ ఔషధాన్ని విరివిగా కొను గోలు చేసి హెచ్‌ఐవీ నుంచి రక్షణ పొందాలనుకునే ప్రతీ ఒక్కరికి ఇవ్వాలని ఆ సంస్థ కోరింది. కాగా హెచ్‌ఐవీ (hiv) చికిత్స నిమిత్తం ఈ డ్రగ్‌కు ఎఫ్‌డీఏ 2022లోనే పచ్చ జెండా ఊపింది.