Huge Donation: ప్రజా దీవెన, హైదరాబాద్: వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి సింగరేణి కాలరీస్ సంస్థ 10కోట్ల 25లక్షల 65వేల 273 రూపాయల భారీ విరాళాన్ని (Huge Donation) అందించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) గారితో కలిసి సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, సంస్థ సీఎండీ బలరాం నాయక్ గారు, కార్మిక సంఘాల నేతలు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)గారిని కలిసి ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ విరాళం ఇచ్చిన సింగరేణి కుటుంబీకులు అందరికీ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.