ప్రజా దీవెన, హైదరాబాద్: పసిఫిక్ ద్వీపమైన వనౌటును భారీ భూకం పం హడలెత్తించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.3గా నమోదు కావడంతో పలు భవనాలు కంపించిపోయా యి. భారీగా ఆస్తులు ధ్వంసమ య్యాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా పలువురు గాయ పడినట్లుగా తెలుస్తోంది. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని వనౌ టులో మంగళవారం దేశంలోని అతిపెద్ద నగరమైన పోర్ట్ విలా నుంచి పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తిం చారు. భూకంపం తర్వాత అదే ప్రాంతంలో 5.5 తీవ్రతతో పలుమా ర్లు ప్రకంపనలు నమోదైనట్లు తెలు స్తోంది.
అయితే పలుచోట్ల వీధుల్లో మృతదేహాలు పడి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే రాజధాని పోర్ట్ విలాలో పలు భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. యూఎస్, యూ కే, ఫ్రెంచ్ రాయబార కార్యాలయా లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబం ధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతు న్నాయి.
యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:47 గంటలకు ప్రధాన ద్వీపం ఎఫేట్ తీరానికి దాదాపు 30 కిమీ దూ రంలో 57 కిమీ లోతులో ఈ ప్రకంపనలు సంభవించినట్లుగా తెలిపింది. ఇక భూకంప దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.