–ఆలయంలో హుండీని కొల్లగొట్టిన దుండగులు
–కట్టర్ సహాయంతో హుoడి పగల గొట్టి స్వాహా పర్వం
Hundi theft: ప్రజాదీవెన, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో దొంగలు మళ్లీ రెచ్చిపోతున్నారు.. తాజాగా.. కేటుగాళ్లు ఓ ఆలయంలోని హోండీని(Hundi theft ) టార్గెట్ చేసి దానిలోని డబ్బులను దోచుకెళ్లారు. హనుమాన్ (hanuman) ఆలయంలో హుండీలో ఉన్న డబ్బులను టార్గెట్ చేసిన దొంగలు.. కట్టర్ సహాయంతో పగులగొట్టి స్వాహా చేశారు. ఈ ఘటన హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ (Hyderabad Narsingh Police Station) పరిధిలోని గంధంగూడలోని శ్రీనివాసనగర్ కాలనీలో ఉన్న హనుమాన్ ఆలయంలో చోటుచేసుకుంది. దుండగుడు గురువారం అర్ధరాత్రి ఆలోయంలోకి ప్రవేశించి దొచుకెళ్లాడు.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది.. పోలీసులు (police) తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున 1.50 గంటలకు ఆలయంలోకి ప్రవేశించిన దుండగుడు హుండీని కొల్లగొట్టాడు. కట్టర్ సహాయంతో హుండీని పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లాడు. దుండగుడు ఆలయంలోకి ప్రవేశించిన అనంతరం తొలుత హుండీ తాళం తీయడానికి యత్నించాడు.. అది రాకపోవడంతో కట్టర్ సహాయంతో దానిని పగలగొట్టాడు. అయితే, హుండీ ఎదురుగా కెమెరా ఉన్న విషయాన్ని పసిగట్టి మోహాం కనిపించకుండా మఫ్లర్ కట్టుకున్నాడు. కాగా, ఉదయాన్నే ఆలయానికి వచ్చిన పూజారులు, సిబ్బంది ఇది చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ చోరీ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ (cctv) ఫుటేజీ ఆధారంగా దుండగుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని.. పోలీసులు తెలిపారు.