ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో గల సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన వీడియోను రెండ్రో జుల క్రి తం మీడియా ముందు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ రావటంతోనే తొక్కిసలాట జరిగినట్లు చెబుతూ వీడియోను రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా తా జాగా మరో సీసీటీవీ ఫుటేజి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడి యోలో అల్లు అర్జున్ థియేట ర్‌లోకి రాకముందే, అపాస్మారక స్థితిలో ఉన్న రేవతిని బయటికి తీసుకొ చ్చినట్లు తెలుస్తోంది. ఈ పాయింట్ నే అల్లు అర్జున్ ఫ్యాన్స్, నెటిజన్లు లేవనెత్తుతున్నారు.
అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగిం దని కామెంట్లు పెడుతు న్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సంధ్య థియేట ర్ తొక్కిస లాట ఘటనపై సోషల్ మీడియాలో ఎవరైనా త ప్పుడు సమాచారం, ప్రజలను అ పోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగి నట్లు కొందరు తప్పుడు వీడి యోలు పోస్టు చేసిన అంశం తమ దృష్టి కి వచ్చిందని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఇలా ఎడిటెడ్ వీడియోలు వైరల్ చేస్తే కఠిన చర్య లు తీసుకుంటామ ని,వార్నింగ్ ఇచ్చారు.