–ఎన్ఓసీ పొందితేనే కొత్త నిర్మాణా లకు చాన్స్
–చెరువుల పరిరక్షణ, ఆక్రమణలు జరగకుండా నిర్ణయం
–మధ్య తరగతి ప్రజలు నష్టపోకుం డా చర్యలు
HYDRA: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో (Hyderabad City) నిత్యం ఎక్క డో ఒకచోట ఆక్రమణల కూల్చి వేత లతో దూసుకెళుతున్న హైడ్రాకి (HYDRA) ప్రభుత్వం మరో కీలక బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం మంజూరు చేసే బిల్డింగ్ పర్మిషన్ల ప్రక్రియలోనూ హైడ్రాను (HYDRA)చేర్చే యోచనలో సీఎం రేవంత్ యేచిస్తున్నట్టు సమాచారం. ఇళ్ల నిర్మాణాలకు హైడ్రా వద్ద కూడా ఎన్ఓసీ పొందాలనే కొత్త నిబంధన దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను రక్షించడం కోసం సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా(HYDRA) (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)ను తీసుకువచ్చింది. కాగా, బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ (Buffer zone, FTL) పరిధిలో హైడ్రా అనుమతి లేకుండా ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే ఆ ఇంటి నెంబర్, కరెంట్, నల్లా కనెక్షన్లను తొలగించనున్నట్లు సమాచారం. పేద, మధ్య తరగతి ప్రజలు నష్టపోకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న ట్లు తెలుస్తోంది. దీనికి సంబం ధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది.