Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Hydra: ఆరుగురు అధికారులపై కేసులు

–కఠిన చర్యలకు హైడ్రా ఉపక్రమణ

Hydra: ప్రజా దీవెన, హైదరాబాద్‌: అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా (HYDRA) దూసుకుపోతోంది. ఇప్పుడు తాజాగా చెరువుల్లో నిర్మాణాలు జరిపిన వారి నుంచి అనుమతులు ఇచ్చిన వారిపై హైడ్రా బుల్డోజర్ (Hydra Bulldozer) దృష్టి సారించింది. అసలు చెరు వుల్లో అక్రమ నిర్మాణాలకు అను మతులు ఇచ్చిన అధికారులు ఎవ రనేది ఆరా తీసిన హైడ్రా మొత్తం ఆరుగురు అధికారులపై కేసులు నమోదు అయ్యాయి. హైదరాబా దులో చెరువులు కట్టడాలకు అను మతులు ఇచ్చిన ఆరుగురు అధి కారులపై పోలీసులు క్రిమినల్ కేసు లు నమోదు చేశారు. హైదరాబాద్‌ లో సిపి అవినాష్ మహంతి కేసుల ను నమోదు చేశారు. చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధామ్స్, బాచుపల్లి ఎంఆర్ఓ (Deputy Commissioner Sudhams, Bachupally MRO)పై కేసు నమోదు అయ్యింది.

మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్స్ హెచ్ ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. హెచ్ఎండీఏ (HMDA) సిటీ ప్లానర్ రాజకుమార్‌పై, నిజాంపేట్ ము న్సిపల్ కమిషనర్ రామకృష్ణపై కేసులు నమోదు చేశారు. హైడ్రా సిఫారసులతో ఆరుగురు అధికా రులపై పోలీసులు కేసులు ఫైల్ చేశారు.మరోవైపు.. మియాపూర్ అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికా రులు కొరడా ఝుళిపించారు. మియాపూర్ చెరువులో అక్రమ కట్టడాలు చేసిన బిల్డర్‌పై (On the builder) కేసు నమోదు చేశారు. మ్యాప్స్ ఇన్ఫ్రా యజమాని సుధాకర్ రెడ్డిపైన రెవె న్యూ అధికారులు కేసు నమోదు చేశారు. మ్యాప్స్ కంపెనీ సుధాకర్ రెడ్డితో పాటు పలువురుపై అధికా రులు కేసులు నమోదు చేశారు. హైడ్రా సిఫార్సు మేరకు కేసులు నమోదు అయ్యాయి. ఎర్రగుంట చెరువులో ఆక్రమణలు చేసి బహు ల అంత భవనాలను మ్యాప్స్ నిర్మించింది. ఈర్ల చెరువులో బహు ళ అంతస్థుల భవనలు నిర్మించిన ముగ్గురిపై బిల్డర్స్‌పై కేసులు నమో దు అయ్యాయి. స్వర్ణలత, అక్కిరా జు శ్రీనివాసులపై రెవెన్యూ అధికా రులు (Revenue Officers)కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురు బిల్డర్స్ ఈర్ల చెరువులో అక్రమంగా బహుళ అంతస్తులు నిర్మించినట్లు అధికారులు గుర్తించా రు.