–పట్టుబడితే జైలు శిక్ష ఖాయం
–ఎవరైనా వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు
–హైడ్రా కమిషనర్ రంగనాధ్
Hydra Commissioner Ranganadh: ప్రజా దీవెన, హైదరాబాద్: హైడ్రా (hydra) పేరుతో కొంతమంది ప్రజలను వేధిస్తున్నారని, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నవిషయం తమ దృష్టికి వచ్చిందని, అటువంటి వారికి కఠిన శిక్ష తప్పదని హైడ్రా కమిషనర్ రంగనాధ్ (Hydra Commissioner Ranganadh)హెచ్చరించారు. సామాజిక కార్యకర్తల (Social workers)పేరుతో కొంతమంది బిల్డర్లను బెదిరిస్తున్నట్టు తెలిసందని చెప్పారు. అటువంటి వారిని విడిచి పెట్టమని, ఎక్కడున్నా పట్టుకుని జైలుశిక్ష విధిస్తామని ఆయన హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో విప్లవ్ అనే వ్యక్తిని పోలీసులు ఇవే అభియోగాలపై అరెస్టు (arrest) చేసినట్టు ఆయన తెలిపారు. ఎవరైనా ఇటువంటి ఆకృత్యాలకు పాల్పడాలని చూస్తే వెంటనే స్థానిక పోలీసులకు గానీ, ఏసీబీకి గానీ ఫిర్యాదు చేయాలని ఆయన ప్రజలకు సూచించారు.