Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Hydra: అక్రమ నిర్మాణాలు కూల్చివేత

చర్యలు చేపట్టిన ‘హైడ్రా’ యంత్రాంగం

Hydra: ప్రజాదీవెన, హైద‌రాబాద్: మణికొండ చిత్రపురికాలనీలో (In Chitrapuri Colony)అక్రమ నిర్మాణాలపై హైడ్రా చ‌ర్య‌ల చేప‌ట్టింది. ఎలాంటి అనుమ‌తులు లేని ఏడు విల్లాలు (Seven villas)అక్ర‌మ నిర్మాణాలుగా హైడ్రా అధికారులు గుర్తించారు. ఇక్కడ 220 విల్లాలకు అనుమతులు ఉండ‌గా, ఏడు విల్లాలు అదనంగా సొసైటీ సభ్యులు నిర్మించారు. అక్రమంగా నిర్మించిన ఈ ఏడు విల్లాలను కూల్చివేశారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు మంగళవారం అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. దీంతో సొసైటీ సభ్యులకు అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే అక్రమ నిర్మాణాల విషయంలో బడా బాబులను సైతం వదిలే ప్రసక్తే లేదని అధికారులు చెబుతున్నారు. చెరువులు, పార్కుల స్థ‌లాల్లో ఉన్న అక్రమ నిర్మాణాలు (Illegal structures)తొల‌గిస్తామ‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు