–ఆర్డినెన్స్ పై సంతకం చేసిన గవర్నర్
Hydra: ప్రజా దీవెన, హైదరాబాద్:హైడ్రాకు (Hydra)చట్టబద్ధత కల్పిస్తూ రేవంత్ రెడ్డి (Revanth Reddy)ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు శనివారం రాజ్ భవన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.జీహెచ్ఎంసీ చట్టంలో కొ త్తగా 374(బి) సెక్షన్ చేరుస్తున్న ట్లుగా ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడేందుకు జీహెచ్ఎంసీ అధికారాలు హైడ్రాకు అప్పగించారు. జలాశయాలు, రోడ్లు, పార్కులు, ఇతర ఆస్తులను కాపాడే బాధ్యత అధికారి లేదా ఏజెన్సీకి అప్పగించే అధికారం ప్రభుత్వానికి కల్పిస్తూ ఆర్డినెన్సు జారీ (Promulgation of Ordinance)చేశారు.